Star Movie | తమిళ యువ నటుడు కవిన్ (Actor Kavin) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన ఈ కుర్ర హీరో.. ఈ ఏడాది ‘దాదా’ సినిమాతో తమిళంలో భారీ హిట్ అందుకున్నాడు. తాజాగా ఈ నటుడు స్టార్ (Star Movie) అనే కొత్త సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ప్యార్ ప్రేమ కాదల్ (Pyar Prema Kadhal) ఫేమ్ ఎలాన్ (Elan) దర్శకత్వం వహిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా (Yuvan Shanker raaja) సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేయగా ఆడియన్స్ వద్ద నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా మూవీ నుంచి మేకర్స్ STAR యొక్క ఫోటో ఆల్బమ్ అంటూ స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో కవిన్ హీరో అవ్వాలని.. నటుడిగా తనను తాను సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలి తపన పడుతున్నట్లు కనిపిస్తుండగా.. ఈ మూవీకి సంగీతమే ప్రధానం అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని తమిళ ప్రోడక్షన్స్ రైస్ ఈస్ట్ ఎంటర్టైనమెంట్స్ (Rise East Entertainments), టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్స్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.