RRR Movien | ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ అదరగొడుతోంది. భాషతో సంబంధం లేకుండా దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్న ఈ చిత్రం.. బాఫ్టా ( బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో బెస్ట్ ఫిల్మ్ అవార్డు కోసం లాంగ్‌లిస్ట్‌లో చేరింది. మరోవైపు ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డుకు షార్ట్‌లిస్ట్ అయ్యింది. జనవరి 11వ తేదీన లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డుల ప్రదానోత్సవానికి రామ్‌చరణ్, ఎన్జీఆర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా చిత్ర ప్రొమోషన్స్లో భాగంగా ఇప్పటికే రాజమౌళి, ఎన్టీఆర్, ఇతర చిత్ర బృందం అక్కడికి చేరుకుంది.
ఈ నేపథ్యంలో లాస్ ఏంజిల్స్‌లో ఉన్న డీజీఏ థియేటర్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను శనివారం ప్రదర్శించారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్‌కు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’కు స్టాండింగ్ ఒవేషన్ లభించింది. చిత్ర ప్రదర్శన అనంతరం హాలీవుడ్ మీడియాతో ఎన్టీఆర్, రాజమౌళి ముచ్చటించారు.
విలేకరులతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. సినిమాలోని ‘నాటు నాటు..’ సాంగ్ కోసం రాజమౌళి 65 రాత్రులు టార్చర్ చేశాడండూ చెప్పుకొచ్చారు. ‘నాటు నాటు పాటని 12 రోజులు షూట్ చేశాము. పర్ఫెక్షన్ కోసం రాజమౌళి విపరీతంగా ప్రాక్టీస్ చేయించారు. నాటు నాటు సాంగ్ పూర్తి చేయడానికి చాలా కష్టపడ్డాల్సి వచ్చింది’ అని ఎన్టీఆర్ వెల్లడించారు.
అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ కంటే ‘కొమురం భీముడో’ సాంగ్ అంటేనే తనకు ఇష్టమని చెప్పారు. ‘‘కొమురం భీముడో’ పాటలో ఎన్టీఆర్ నటన నా అన్ని చిత్రాల్లో ఆల్ టైం ఫేవరేట్. ఇంత వరకు నేను అంత మంచి సన్నివేశాలు డైరెక్ట్ చేయలేదు. ఎన్టీఆర్ ఒక కంటి నొస మీద కెమెరా పెడితే.. ఆ ఒక్క కంటి నొసతో యాక్టింగ్ చేయగలడు. ఎన్టీఆర్ అంత టాలెంటెడ్’ అంటూ ఎన్టీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.
రాజమౌళి దర్శకత్వంలో.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కోట్లు వసూల్ చేసింది. ఇప్పటికే పలు అవార్డులను సైతం దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ‘గోల్డెన్ గ్లోబ్’తో పాటు ఆస్కార్స్ రేసులోనూ ఈ ఫిల్మ్ పోటీపడుతోంది. గోల్డెన్ గ్లోబ్లో బెస్ట్ ఫారిన్ ఫిల్మ్‌తో పాటు నాటు నాటు సాంగ్‌కు మ్యూజిక్ క్యాటగిరీలో పోటీపడుతోంది. ఇక ఆస్కార్స్‌లో నాటు నాటు సాంగ్ రేసులో ఉంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ షార్ట్‌లిస్టులో ఆర్ఆర్ఆర్ పోటీపడుతున్న విషయం తెలిసిందే.