‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నిర్మాతగా మారుతున్నారు. సమ్మక్క సారక్క క్రియేషన్స్ పేరుతో నూతన నిర్మాణ సంస్థను ఆరంభించారు. తొలి ప్రయత్నంగా చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్‌తో కలిసి ‘ఏఐ అమీనా జరియా రుక్సానా-గులాబీ’ పేరుతో ఓ ప్రేమకథను తెరకెక్కించబోతున్నారు. దీనికి ఆయనే కథనందిస్తున్నారు. చేతన్ బండి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సోమవారం అనౌన్స్మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘2009లో గోదావరిఖని నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించే అమ్మాయి తాలూకు లోతైన భావోద్వేగాలను ఆవిష్కరిస్తుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెడతాం’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కథ : శ్రీకాంత్ ఓదెల, నిర్మాతలు: శ్రీకాంత్ ఓదెల, అనురాగ్ రెడ్డి, శరత్చంద్ర, రచన-దర్శకత్వం: చేతన్ బండి.