Peddakapu-1 Movie | ఆ స్టార్ నటుడు హ్యాండివ్వడంతో.. శ్రీకాంత్ అడ్డాల విలన్ పాత్ర చేయాల్సి వచ్చిందట..!
Peddakapu-1 Movie | నిన్న రిలీజైన పెదకాపు-1 ట్రైలర్ ఏ రేంజ్లో సంచలనం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ట్రైలర్లో మరో షాకింగ్ విషయమేంటంటే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఓ కీలకపాత్రలో కనిపించడం.
Peddakapu-1 Movie | నిన్న రిలీజైన పెదకాపు-1 ట్రైలర్ ఏ రేంజ్లో సంచలనం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా కుల రాజకీయాలతో అణచివేతకు గురవుతున్న ఓ గ్రామంలో వెనుకుబడిన కులానికి చెందిన ఓ కుర్రాడు వాళ్లకు ఎదురితిరిగి చేసిన పోరాటం ఎక్కడి వరకు తీసుకెళ్లిందని అరటి పండు ఒలిచి పెట్టినంత క్లారిటీగా సినిమా కాన్సెప్ట్‌ను ట్రైలర్లో వివరించారు. ఒక్క ట్రైలర్‌తోనే సినిమాపై హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ఈ ట్రైలర్లో మరో షాకింగ్ విషయమేంటంటే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఓ కీలకపాత్రలో కనిపించడం.
ఆయన నోటి వెంట వచ్చిన డైలాగ్స్ బట్టి చూస్తే ఈ సినిమాలో ఈ పాత్ర కీలకం కాబోతుందని ఇట్టే అర్థమయిపోయింది. నిజానికి అడ్డాల తను అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసినప్పుడే కొన్ని సినిమాల్లో అలా కెమెరా ముందు కనిపించి వెళ్లాపోయాడు. ఇక ఇప్పుడు ఏకంగా కీ రోల్ ప్లే చేయడమంటే విశేషమనే చెప్పాలి. ఇప్పటికే ఎంతో మంది దర్శకులు నటులుగా మారారు. కాశీ విశ్వనాథ్, దాసరి నారాయణ రావు ఈ మధ్య తరుణ్ భాస్కర్, సముద్ర ఖని ఇలా వీళ్లందరు ఫుల్ టైమ్ నటులుగా కూడా రాణించారు. ఇప్పుడదే బాటలో అడ్డాల కూడా అడుగులేశాడు.
ఇక ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో తను నటుడిగా మారడానికి కారణాన్ని కూడా అడ్డాల వెల్లడించాడు. ముందుగా ఆ క్యారెక్టర్‌కు మలయాళ నటుడు, రోమంచమ్ ఫేమ్ శౌబిన్ షహీర్ను అనుకున్నామని. తను కూడా ఆ రోల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అడ్డాల వెల్లడించాడు. అయితే ఏమైందో తెలీదు కానీ అతను షూటింగ్‌కు రాలేదట, దాంతో అప్పటికప్పుడు మరో ఆర్టిస్టును వెతికే క్రమంలో తన అసోసియేట్ కిషోర్ ఆ క్యారెక్టర్‌ను తననే చేయమని ఒప్పించడంతో నటుడిగా అవతారమెత్తాల్సి వచ్చయిందని అడ్డాల చెప్పుకొచ్చాడు.
అలా శ్రీకాంత్ అడ్డాల అనుకోకుండా నటుడిగా మారనని, అంతేకాని తనకు నటనపై ఇంట్రెస్ట్ గట్రా లేవని చెప్పుకొచ్చాడు. నిజానికి ఈ సినిమాలో ట్రైలర్లో బాగా రిజిస్టర్ అయిన క్యారెక్టర్లో ఇది ఒకటి. సగటు విలన్‌కు ఉండాల్సిన అన్ని లక్షణాలు శ్రీకాంత్‌లో పుష్కలంగా కనిపించాయి. ఇక భవిష్యత్తులో పలు డైరెక్టర్ల మాదిరిగానే శ్రీకాంత్ కూడా నటుడిగా బిజీ అవుతాడో చూడాలి మరి. విలేజ్ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న పెద్దకాపు-1 సినిమాతో నిర్మాత మిర్యాల రవిందర్ రెడ్డి మేనల్లుడు హీరోగా పరిచయమవుతున్నాడు. సెప్టెంబర్ 28న రిలీజవ్వబోతున్న ఈ సినిమాపై జనాల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

