Sridevi ShobanBabu Trailer | విభిన్న కథలను ఎంచుకుంటూ తన శైలి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు సంతోష్ శోభన్. వర్షం, బాబీ సినిమాల దర్శకుడు శోభన్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన సంతోష్ సినీరంగంంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ‘గోల్కొండ హై స్కూల్’ చిత్రంలో గౌతమ్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సంతోష్ ‘పేపర్ బాయ్’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా సంతోష్‌కు నటుడిగా మంచి మార్కులే పడ్డాయి. తర్వాత ‘ఏక్ మినీ కథ’ వంటి డిఫరెంట్ కథతో వచ్చి మంచి విజయం సాధించాడు. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం మంచి వ్యూవర్ షిప్‌ను సాధించింది. ఇటీవలే ఈయన మంచి రోజులోచ్చాయి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘శ్రీదేవి శోభన్ బాబు’. ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చిరంజీవి పెద్ద కూతురు సుష్మితా కొనిదెల నిర్మించారు.
‘నమస్కారం మరి కొన్ని విశేషాలతో మీ ముందుకు వచ్చాం.. కథలో ముఖ్యాంశాలు’ అంటూ ట్రైలర్ ప్రారంభమైంది. ‘హీరోకి నోటి వాటం ఎక్కువ’ అంటూ సంతోష్ శోభన్ క్యారెక్టర్, ‘హీరోయిన్‌కు చేతి వాటం ఎక్కువ’ అంటూ హీరోయిన్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ‘వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఛాలేంజ్..గెలిచే సమయానికి ఒక సమస్య. ఉత్కంఠభరితంగా సాగుతున్న కథలో, మనసుకు హత్తుకునే సన్నివేశాలు. మరెన్నో విశేషాలతో త్వరలోనే మీ అభిమాన థియేటర్లలో’ అంటూ వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. మధ్యలో హీరో ‘ఇక్కడ మాటలతో నెగ్గం బాబాయి.. మూటలుంటేనే నెగ్గుతాం’ అనే డైలాగ్ ఆలోచింపజేస్తుంది. ట్రైలర్లో కమ్రన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సిద్ధార్థ్ రామస్వామి కెమెరా పనితనం బాగుంది. వర్షబొల్లమ్మా హీరోయిన్గా నటించింది.