Ustaad | ఇటీవలే ‘భాగ్ సాలే’ (Bhaag Saale) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు మత్తు వదలరా ఫేం శ్రీసింహ(Sri Simha). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. ఈ హీరో నటిస్తున్న కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. శ్రీ సింహ టైటిల్ రోల్ పోషిస్తున్న ప్రాజెక్ట్ ఉస్తాద్ (Ustaad ). ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అంతేకాదు సినిమా మేకింగ్ వీడియో గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు.
మసూద, బలగం సినిమాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న కావ్య కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రజనీ కొర్రపాటి, రాకేశ్ రెడ్డి గడ్డం, హిమంక్ రెడ్డి దువ్వూరు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాపులర్ డైరెక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అకీరా బీ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
మరి శ్రీ సింహా ఈ సినిమాతోనే హిట్టందుకుంటాడేమో చూడాలంటున్నారు సినీ జనాలు. ఎయిర్‌ఫోర్స్ కు సంబంధించిన స్టోరీ నేపథ్యంలో సినిమా రాబోతున్నట్టు విజువల్స్‌తో అర్థమవుతోంది.
ఉస్తాద్ మేకింగ్ వీడియో గ్లింప్స్..
And… cut! 🎬
It’s a wrap for #Ustaad ❤️🔥Parking in theaters on August 12th 🔥#UstaadOnAug12th@Simhakoduri23 @KavyaKalyanram @RaviSivaTeja4 @anuhasan01 @RavindraVijay1 @menongautham @phani025 @VaaraahiCC @krishient @rakeshreddy1224 @himankd @pavan_pappula @vamsikaka pic.twitter.com/ar6fPlqUrO
— Vaaraahi Chalana Chitram (@VaaraahiCC) July 10, 2023