Bhag Sale | నవ్వించడమే లక్ష్యం : హీరో శ్రీసింహా కోడూరి
‘దర్శకుడు రాజమౌళితో సినిమా చేయాలని అందరికీ ఓ కల ఉంటుంది. నాకు వుంది. అయితే చనువు ఉంది కదా? అని ఛాన్స్‌లు అడగలేను. ముందు నేను చాలా నేర్చుకోవాలి. ఆ తరువాత ఆయనకు ఓకే అనుకుంటే తీసుకుంటారు’ అన్నారు హీరో శ్రీసింహా కోడూరి.
‘దర్శకుడు రాజమౌళితో సినిమా చేయాలని అందరికీ ఓ కల ఉంటుంది. నాకు వుంది. అయితే చనువు ఉంది కదా? అని ఛాన్స్‌లు అడగలేను. ముందు నేను చాలా నేర్చుకోవాలి. ఆ తరువాత ఆయనకు ఓకే అనుకుంటే తీసుకుంటారు’ అన్నారు హీరో శ్రీసింహా కోడూరి. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘భాగ్ సాలే’. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకుడు. అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీసింహా మీడియాతో ముచ్చటించారు.
ఆయన మాట్లాడుతూ ‘మేము ఏదో సందేశాన్ని ఇవ్వాలని ఈ సినిమా చేయలేదు. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడిని నవ్వించాలని చేశాం. ఇప్పటికే కొన్ని చోట్ల షోలు వేశాం. వచ్చిన ప్రేక్షకులు హాయిగా నవ్వుకుని బయటకు వచ్చారు. అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఈ సినిమా వుంటుంది. టీజర్, ట్రైలర్ నచ్చితేనే జనాలకు సినిమాలపై ఆసక్తి కలుగుతుంది. ఇంత వరకు నేను నటించిన ఏ సినిమాకు రాని బజ్ ఈ సినిమాకు వచ్చింది. వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల సినిమా బాగా ఆడుతుందనే నమ్మకం వుంది. కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం వల్ల ఈ సినిమా మరోస్థాయికి వెళ్లింది. ఈ సినిమాకు సంగీతమే మెయిన్ పిల్లర్. క్రైమ్ కామెడీ జానర్లో తీసిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. తప్పకుండా ఈ చిత్రం హీరోగా నాకు మరింత పేరును తెచ్చిపెడుతుందనే నమ్మకం వుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

