పెళ్లిసందడిD (Pelli SandaD) సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసింది శ్రీలీల (Sreeleela). ఈ సినిమాతో టాలీవుడ్ (Tollywood) ఎంట్రీ ఇచ్చి గ్లామర్, యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్‌తో వరుస ఆఫర్లు ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల కాలంలో కృతిశెట్టి తర్వాత మూడు, నాలుగు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్ శ్రీలీల కావడం విశేషం. అయితే తక్కువ టైంలోనే ఇలా ఆఫర్లు వచ్చినా అంత సంతృప్తికరంగా లేదట ఈ యునైటెడ్ స్టేట్స్ భామ.
ఇంతకీ ఎందుకంటారా..? ఇపుడు వస్తున్న ఆఫర్లు కాకుండా స్టార్ హీరోల సినిమాల కోసం ఎదురుచూస్తుందట. ఎన్టీఆర్, మహేశ్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం వస్తే బాగుంటుందని వెయిట్ చేస్తుందన్న వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ప్రస్తుతం రవితేజతో ధమాకా (Dhamaka)చిత్రంలో నటిస్తోంది శ్రీలీల. మరోవైపు వైష్ణవ్ తేజ్‌తో కూడా ఓ సినిమాకు సైన్ చేసింది.
తాజాగా చక్కర్లు కొడుతున్న గాసిప్ ప్రకారం ఏ-లిస్ట్ స్టార్ సినిమాలో ఛాన్స్ రావడం కోసం ఈ బ్యూటీ ఓ యువ నిర్మాతను సంప్రదించిందని జోరుగా టాక్ వినిపిస్తోంది. సదరు యువ నిర్మాత ఓ స్టార్ హీరోతో సినిమా చేయనుండగా..ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారని టాక్ నడుస్తోండగా…వీటిలో ఒక హీరోయిన్గా తనకు ఛాన్స్ ఇప్పించాలని శ్రీలీల పట్టుబడుతున్నట్టు ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ వార్త అఫీషియల్ కాకున్నా..స్టార్ హీరోతో కలిసి సినిమా చేయాలన్న శ్రీలీల కోరిక నెలవేరాలని విష్ చేస్తున్నారు సినీ జనాలు.
Read Also : Jr NTR | ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనింగ్ షురూ.. దేనికోసమంటే..?
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!