అదృష్టం కలిసి రావాలే గానీ ఇండస్ట్రీలో నాయికలు డేట్స్ దొరకనంత బిజీ అవుతుంటారు. ఇలాగే టాలీవుడ్లో విరామం లేనన్ని సినిమాలు దక్కించుకుంటున్నది శ్రీలీల. ఆమె చేతిలో ప్రస్తుతం ఎనిమిది చిత్రాలున్నాయి. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి కొందరు స్టార్ హీరోలు ఆమెతో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. టాలీవుడ్లో వరుస చిత్రాలతో తీరిక లేని శ్రీలీల ఇతర భాషల అవకాశాలను వద్దనుకుంటున్నదని తెలుస్తున్నది. గతంలో అనుష్క, కాజల్, సమంత, తమన్నా వంటి స్టార్ హీరోయిన్స్ తెలుగుతో పాటు తమిళంలోనూ పేరున్న హీరోల సరసన నటించారు. దక్షిణాది తారలుగా పేరు తెచ్చుకున్నారు. అయితే వారికి శ్రీలీలలా ఒక్కసారిగా అవకాశాలు వచ్చిపడలేదు. దాంతో సమయం తీసుకుంటూ అన్ని భాషల్లో నటిస్తూ వచ్చారు. నెలకో కొత్త సినిమా వచ్చి పడుతుండటంతో డేట్స్ ఖాళీ లేనందున శ్రీలీలకు ఇలా ఇతర భాషల్లో నటించే వీలు కుదరడం లేదట. ఆమె ఇతర భాషల్లో నటించాలంటే కొంతకాలం పాటు వేచి చూడాల్సిందే.