Arjuna Phalguna movie collections | శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ జంటగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన చిత్రం అర్జున ఫల్గుణ. వీళ్లే ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాను నిర్మిస్తున్నారు. అలాంటి నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమా కావడంతో అర్జున ఫల్గుణపై మంచి అంచనాలే ఉన్నాయి. పైగా శ్రీ విష్ణు కూడా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తాడు అని నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. అయితే విడుదలైన మొదటి రోజే ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. దానికి తోడు అఖండ, పుష్ప బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపిస్తున్న సమయంలో అర్జున ఫల్గుణ వచ్చింది. దాంతో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వచ్చాయి. కనీసం కోటి రూపాయలు కూడా వసూలు చేయలేకపోయింది ఈ సినిమా.
నైజాం: 0.19 కోట్లు
సీడెడ్: 0.13 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.11 కోట్లు
ఈస్ట్: 0.09 కోట్లు
వెస్ట్: 0.07 కోట్లు
గుంటూరు: 0.12 కోట్లు
కృష్ణా: 0.06 కోట్లు
నెల్లూరు: 0.04 కోట్లు
ఏపీ + తెలంగాణ: 0.81 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.07 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్: 0.88 కోట్లు
అర్జున ఫల్గుణ సినిమాను రూ.2.5 కోట్లకు అమ్మారు. శ్రీ విష్ణు గత సినిమా రాజ రాజ చోర దాదాపు 6 కోట్లు వసూలు చేసింది. దాంతో అర్జున ఫల్గుణ బిజినెస్ బాగానే అయింది. బ్రేక్ ఈవెన్ కు రూ.2.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 88 లక్షలు మాత్రమే వసూలు చేసింది ఈ సినిమా. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.1.62 కోట్ల దూరంలో ఆగిపోయింది. కొన్ని చోట్ల ఈ సినిమాకు డెఫిషిట్లు కూడా వచ్చాయని తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Arjuna Phalguna movie | ప్రయోగాలు చేయను అంటున్న విష్ణు
Arjuna Phalguna | అర్జున ఫల్గుణ మూవీ రివ్యూ
Amritha Aiyer | గ్రీన్ చీరలో అమృత అయ్యర్ ఫొటోలు అదరహో..
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..
అప్పుడూ.. ఇప్పుడూ కరోనా నుంచి తప్పించుకున్న అదృష్టవంతులు వీళ్లే..