Squid Game Final Trailer | ‘స్క్విడ్‌గేమ్ 3’ ఫైనల్ ట్రైలర్ విడుదల.. ఉత్కంఠగా చివరి సీజన్!
Squid Game S3 | ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'(Squid Game) చివరి సీజన్ మరో 13 రోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న విషయం తెలిసిందే.
Squid Game S3 Final Trailer | ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్'(Squid Game) చివరి సీజన్ మరో 13 రోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న విషయం తెలిసిందే. ఎంతో మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వెబ్ సిరీస్ చివరి సీజన్ జూన్ 27, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఫైనల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్ చూస్తుంటే, కథానాయకుడు సియోంగ్ గీ-హున్ (లీ జంగ్-జే) ఈ ప్రాణాంతక ఆటకు ఎలా ముగింపు పలుకుతాడు, అలాగే ఈ గేమ్ వెనుక ఉన్న ఫ్రంట్ మ్యాన్‌ను కనిపెట్టాడా లేదా అనే అంశాలు ఈ సీజన్లో ప్రధానంగా చూపించనున్నారని స్పష్టమవుతోంది. మొదటి రెండు సీజన్లలో భారీ విజయాన్ని సాధించిన ఈ కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, తెలుగుతో పాటు అనేక భారతీయ భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. ఈ చివరి సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్‌కు హ్వాంగ్ డాంగ్ హ్యుక్ దర్శకత్వం వహించారు.
Read More
-
Vemulapalli : బుగ్గబావిగూడెంలో రహదారిపై పారుతున్న మురుగు నీరు
-
Honeymoon murder | ఉత్తర ఖాసీ హిల్స్‌లో ఆ దంపతులు గడిపింది ఈ ఇంట్లోనే.. Video
-
Yellandu : ప్రజల దృష్టి మరల్చేందుకే కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు : మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

