Sound Party | సౌండ్ పార్టీ నవ్విస్తుంది
‘బిగ్‌బాస్' ఫేమ్ వీజే సన్నీ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సౌండ్ పార్టీ’. హిత్రిక శ్రీనివాస్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంజయ్ శేరి దర్శకుడు.
‘బిగ్‌బాస్’ ఫేమ్ వీజే సన్నీ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సౌండ్ పార్టీ’. హిత్రిక శ్రీనివాస్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంజయ్ శేరి దర్శకుడు. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీశ్యామ్ గజేంద్ర నిర్మాతలు. వచ్చే నెలలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు సంపత్ నంది విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ ‘ఇటీవల విడుదల చేసిన టీజర్ బావుంది. అలాగే మెహిత్ చేసిన సంగీతం కూడా చాలా బావుంది.
ఈ చిత్రం ‘జాతిరత్నాలు’ సినిమా తరహాలో ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. వీజే సన్నీకి ఇది మంచి సినిమా అవుతుంది’ అన్నారు. నిర్మాత రవి పోలిశెట్టి మాట్లాడుతూ ‘మా సంస్థ నుంచి వస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రమిది. యంగ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ న్యూఏజ్ స్టోరీస్‌తో సినిమాలు చేయాలన్న సంకల్పంతో మా సంస్థ చిత్రాలను నిర్మిస్తుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

