e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home News చిరు వ్యాపారుల‌కు అండ‌గా సోనూసూద్‌

చిరు వ్యాపారుల‌కు అండ‌గా సోనూసూద్‌

సినిమాల‌తో బిజీ షెడ్యూల్ లో ఉంటూనే మ‌రోవైపు సామాజిక సేవ‌పై దృష్టిపెడుతున్నారు ప్ర‌ముఖ సినీ సోనూసూద్. పేద, మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాలు చేసుకునే చిరు వ్యాపారాలు దేశానికి వెన్నెముక‌గా నిలుస్తాయ‌ని, చిరు వ్యాపారుల‌కు అండ‌గా నిలువాల‌ని సోనూసూద్ కొంత‌కాలంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా #supportsmallbusiness హ్యాష్‌ ట్యాగ్ తో క్యాంపెయిన్ చేస్తున్నారు.

సైకిల్ మీద తిరుగుతూ గుడ్లు, బ్రెడ్లు అమ్ముతూ, మిల్క్ మ్యాన్ గా, రొట్టెలు త‌యారు చేసే దాబా య‌జ‌మానిగా మారి, వాటికి సంబంధించిన వీడియోల‌ను నెట్టింట్లో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ కూడా అయ్యాయి. నేష‌న‌ల్ మీడియాతో సోనుసూద్ మాట్లాడుతూ..చిరు వ్యాపారం దేశానికి వెన్నెముక‌. చిన్న వ్యాపారాల‌ను ప్ర‌మోట్ చేసేందుకు ఎప్పుడూ ప్ర‌య‌త్నిస్తుంటా. చిరు వ్యాపారుల‌కు మ‌ద్ద‌తుగా నిలువాల్సిన అవ‌స‌ర‌ముంది. చాలా మంది చిన్న వ్యాపారులు త‌మ రోజువారీ జీవనోపాధిని కొనసాగించలేకపోతున్నారు. నిజాయితీగా ప‌నిచేసుకుంటూ రోజూ వారి సంపాద‌న కోసం ఎంత క‌ష్ట‌ప‌డ‌తారో చూసిన త‌ర్వాత వారికి నా వంతు సాయం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నా.

- Advertisement -

నేను చిన్న ప‌ట్ట‌ణం నుంచి వ‌చ్చాను. ప్ర‌జ‌లు త‌మ చిన్న‌పాటి వ్యాపారాన్ని న‌డిపించుకునేందుకు ఎంత క‌ష్ట‌ప‌డ‌తారో నాకు తెలుసు. చిరు వ్యాపారుల‌కు స‌హ‌కార‌మందిస్తే దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ద‌న్నుగా నిలువొచ్చు. ఈ చిన్న వ్యాపారాలు దేశంలోని గ్రామాల్లో అట్ట‌డుగు క్షేత్ర స్థాయి నుంచి ప‌నిచేస్తాయి. వారికి సాయంగా నిల‌వ‌డం చాలా అవ‌స‌ర‌మ‌ని సోనూసూద్ సూచించారు.

ఇవి కూడా చదవండి..

‘మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియ‌న్ మ్యాన్ ’ గా ప్ర‌భాస్

శాకుంత‌లంలో పాపుల‌ర్ టీవీ హోస్ట్

టైగ‌ర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖ‌ర్చు..!

కేసు గెలిస్తే కారు నుంచి బైకుకు వ‌చ్చాడు..‘తిమ్మ‌రుసు’ ట్రైల‌ర్

త‌రుణ్‌, ఉద‌య్‌కిర‌ణ్‌తో న‌న్ను పోల్చొద్దు: వ‌రుణ్ సందేశ్‌

ప్రియ‌మణి-ముస్త‌ఫారాజ్ వివాహం చెల్ల‌దు..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana