సోనూసూద్ డీప్ ఫేక్ వీడియో
ఇప్పటికే పలువురు ప్రముఖులు డీప్ ఫేక్ వీడియోల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనగా తాజాగా ఆ జాబితాలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ చేరారు. కష్టకాలంలో ఎంతో మందికి ఆయన అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నారు.
ఇప్పటికే పలువురు ప్రముఖులు డీప్ ఫేక్ వీడియోల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనగా తాజాగా ఆ జాబితాలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ చేరారు. కష్టకాలంలో ఎంతో మందికి ఆయన అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నారు. కొందరు ఆకతాయిలు ఇప్పుడు అతని ఫేక్ వీడియోను రూపొందించి అభిమానులను డబ్బులు అడుగుతున్నారు. దీనిపై జాగ్రత్తగా ఉండాలని సోనూసూద్ తన సోషల్ మీడియా ద్వారా సూచించారు.
‘కొందరు నా డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేసి అభిమానులతో చాటింగ్ చేస్తూ, వారికి వీడియో కాల్స్ చేస్తూ డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారు. చాలా మంది అమాయకులు ఆ వీడియోలో ఉన్నది నేనే అనుకొని సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. ఇలాంటి వీడియో కాల్స్ వస్తే నమ్మకండి. జాగ్రత్తగా ఉండండి’ అని ఆయన కోరారు. నిజ జీవితంలో జరిగిన ఇలాంటి ఘటనల మీదే తాను ‘ఫతే’ సినిమా తీస్తున్నట్లు చెప్పారు. డీప్ ఫేక్, లోన్ యాప్స్ వల్ల జరుగుతున్న సైబర్ నేరాలను అందులో చూపించనున్నట్లు తెలిపారు.
మొదట రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అలియా భట్, కాజోల్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా డీప్ ఫేక్ వీడియోలు ఆందోళన కలిగించాయి. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ కూడా దీని బారిన పడ్డారు. వీటిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వీటిని నివారించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurukul Schools | తప్పుసర్కార్ది .. శిక్ష సిబ్బందికి.. ఇదీ సాంఘిక సంక్షేమ గురుకులంలో దుస్థితి!
Cyber Crime | తెలంగాణలో సైబర్ నేరగాళ్ల విధ్వంసం.. గంటకు రూ.17 లక్షలు స్వాహా!
KTR Bus Yatra | 11 నుంచి 14 మధ్య కేటీఆర్ బస్సు యాత్ర.. 29న దీక్షా దివస్.. 50 వేల మందితో భారీ సభ
Gen Z Protests | జర్మనీలో జెన్‌జీ ఆగ్రహజ్వాలలు.. 34 నగరాల్లో నిరసనలు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో లూటీలు!
Gratuity Calculator | ఉద్యోగం మానేస్తున్నారా? మీకు రావాల్సిన గ్రాట్యుటీ ఎంతో ఇలా లెక్కించండి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

