Sonu Nigam | పిలవని పేరంటానికెళ్లిన సోనూ నిగమ్.. పెళ్లిమండపంలో సోనూను చూసి అందరూ షాక్
పిలవని పేరంటానికెళ్లిన సోనూ నిగమ్ | పెళ్లికూతురు తన తల్లిదండ్రులను వదిలి.. పెళ్లికొడుకుతో వెళ్లిపోతున్నదని.. తన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి ఏడుస్తున్న సమయంలోనే సోనూ అక్కడికి చేరుకోవడంతో
Sonu Nigam | సోనూ నిగమ్.. పేరు వినగానే మనకు మ్యాజికల్ వాయిస్ గుర్తొస్తుంది. ఆయన బాలీవుడ్ సింగర్ అయినప్పటికీ.. టాలీవుడ్‌తోనూ ఆయనకు లింక్ ఉంది. తెలుగులో చాలా పాటలు పాడి.. తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఇక అసలు విషయానికి వస్తే.. సోనూ నిగమ్ ఇటీవల మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయినికి వెళ్లాడు. ఏదో పని మీద ఉజ్జయినికి వెళ్లి అక్కడ ఓ హోటల్లో స్టే చేశాడు సోనూ.

అదే సమయంలో అదే హోటల్లో జరుగుతున్న ఓ పెళ్లికి వెళ్లి అందరికీ షాక్ ఇచ్చాడు సోనూ. అంతకుముందే సోనూ సిటీలో ఉన్న మహాకాల్, కాల్బైరవ్ గుళ్లకు వెళ్లి తిరిగి హోటల్‌కు వచ్చాడు. అప్పటికే అక్కడ హాల్లో ఓ పెళ్లి జరుగుతోంది. దీంతో పిలవని పేరంటానికి వెళ్లిన నిగమ్.. డైరెక్ట్‌గా పెళ్లిమండపం ఎక్కి నూతన వధూవరులను ఆశీర్వదించాడు. దీంతో పెళ్లికొడుకు, పెళ్లి కూతురుతో పాటు పెళ్లికి వచ్చిన అతిథులు షాక్ అయ్యారు.
సోనూ ఆ పెళ్లికి వెళ్లే సమయానికి అక్కడ అప్పగింతల కార్యాక్రమం నడుస్తోందట. పెళ్లికూతురు తన తల్లిదండ్రులను వదిలి.. పెళ్లికొడుకుతో వెళ్లిపోతున్నదని.. తన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి ఏడుస్తున్న సమయంలోనే సోనూ అక్కడికి చేరుకోవడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. సోనూను చూసి పెళ్లికొడుకు, పెళ్లికూతురుతో సహా.. అందరి ముఖాల్లో చిరునవ్వు చిందించింది. సోనూ అక్కడ ఉన్నది 5 నిమిషాలే అయినప్పటికీ.. పెళ్లి కొడుకు, పెళ్లికూతురుకు మాత్రం తమ పెళ్లి చిరకాలం గుర్తుండిపోతుంది. తమ పెళ్లికి వచ్చిన సోనూను వాళ్లు జీవితాంతం తలుచుకుంటారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Rakul Preet Singh Christmas | రకుల్ ఈ సారి ఎవరితో క్రిస్మస్ చేసుకోబోతుందంటే..?
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

