స్టార్స్ వరుసగా సినిమాలు చేస్తూ ఫామ్‌లో ఉంటే ఆ క్రేజ్‌కు తగినట్లు బిజినెస్ అవుతుంటుంది. నటన నుంచి కొంత గ్యాప్ తీసుకున్నా…వ్యాపార వర్గాల్లో సందేహాలు తలెత్తక మానవు. ప్రస్తుతం సోనమ్ కపూర్ కొత్త సినిమా ‘బ్లైండ్’కు ఇదే పరిస్థితి ఎదురవుతున్నది. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత మూడేండ్లు సినిమాలు చేయలేదు సోనమ్. ఆమె తాజాగా ‘బ్లైండ్’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా విడుదల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తున్నది. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నా…చిత్ర నిర్మాతలు చెప్పినంత ధర పలకడం లేదట.
నిర్మాతలు దాదాపు 40 కోట్ల రూపాయలు కోట్ చేస్తున్నారని సమాచారం. ప్రతికూల మార్కెట్ పరిస్థితుల్లో ఓటీటీలు ఇంత ధర ఇచ్చేందుకు సుముఖంగా లేవు. దీంతో సినిమాను థియేటర్లో రిలీజ్ చేయాలా? లేక రేట్ తగ్గించి ఓటీటీకి ఇవ్వాలా? అనే సందిగ్ధత నెలకొంది. దీంతో సోనమ్‌కు రీఎంట్రీ కష్టాలు తప్పడం లేదు. 2011లో వచ్చిన కొరియన్ మూవీ ‘బ్లైండ్’ ఆధారంగా ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి షోమ్ మకీజా దర్శకత్వం వహిస్తున్నారు. దివ్యాంగురాలైన ఓ పోలీస్ ఆఫీసర్ సీరియల్ కిల్లర్‌ను ఎలా పట్టుకుంది అనేది ఈ చిత్ర కథాంశం.