అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ది ఘోస్ట్ (The Ghost). పీఎస్వీ గరుడ వేగ ఫేం ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ కొత్త షెడ్యూల్ షూటింగ్ కోసం నాగార్జున అండ్ టీం ఇప్పటికే దుబాయ్‌కు చెక్కేసింది. ఇటీవలే దుబాయ్‌లోని బ్యూటీఫుల్ లొకేషన్లలో చిత్రీకరణకు సంబంధించిన స్టిల్స్ విడుదల కాగా నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రవీణ్ సత్తారు టీం ఈ షెడ్యూల్లో కొన్నికీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా..సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) కూడా పాల్గొంటుందట.
అయితే సోనాల్ చౌహాన్ ఓ వైపు యాక్షన్ అవతార్ కనిపిస్తూనే..మరోవైపు అందాల ఆరబోత కూడా చేయబోతుందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న స్టిల్స్ చెబుతున్నాయి. తాజాగా ఓ స్టిల్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. సోనాల్ షిప్ బోర్డుపై బికినీ గాళ్‌గా అందాలు ఆరబోస్తుంటే..స్టైలిష్ లుక్‌లో ఉన్న నాగ్ ఆ షిప్‌ను డ్రైవ్ చేస్తున్నాడు.
దుబాయ్‌లోని సముద్రతీరంలో క్లిక్ మనిపించిన ఈ ఫొటో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. సోనాల్ చౌహాన్ అందాల కనువిందుతోపాటు రిస్కీ స్టంట్స్ తో అలరించబోతుందట. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Also: RRR Runtime | ఆర్ఆర్ఆర్ సినిమా నిడివి ఎంతో తెలిసిపోయింది..!
Read Also: RRR Budget Details | ఏపీ ప్రభుత్వానికి ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ బడ్జెట్ లెక్కల రిపోర్టు ఇదే..!
Ghost in Dubai 🌊 🧜♀️🌊#love #sonalchauhan #comfort #trending #ghostmovie #pink #white #sea #waves #dubai #setlife #shoot #water #baby #wednesdaythought pic.twitter.com/jIbqwAqYvz
— SONAL CHAUHAN (@sonalchauhan7) March 16, 2022