Sudheer Babu | హిట్టు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు సుధీర్ బాబు (Sudheer Babu). గతేడాది హరోంహర, మా నాన్న సూపర్ హీరో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇవి మిక్స్డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ప్రస్తుతం జటాధర (Jatadhara) అనే సినిమా చేస్తున్నాడు. మైథాలాజీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాకి వెంకట్ కల్యాణ్ (Venkat Kalyan) కథనందిస్తూ దర్శకత్వం వహిస్తుండగా.. తెలుగు, హిందీ బైలింగ్యువల్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సినిమాతో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మార్చి 08 నుంచి సోనాక్షి జటాధర షూటింగ్లో పాల్గోనబోతున్నట్లు సమాచారం. కాగా దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవలే హీరమండి: డైమండ్ బజార్ అనే వెబ్ సిరీస్‌తో వచ్చి సూపర్ హిట్ అందుకుంది సోనాక్షి.