Sobhita dhulipala | తెలుగు రాష్ట్రాల నుండి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీకి వస్తున్నారు. కాని అందులో కొందరు మాత్రమే తమ టాలెంట్‌తో నిలబడుతున్నారు. వారిలో తెనాలి అమ్మాయి శోభిత ధూళిపాళ్ల కూడా ఒకరు. ఆరంభంలోనే అందాలతో మాయ చేసిన ఈ చిన్నది.. దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు అందిపుచ్చుకుంది. టీనేజ్లోనే మోడలింగ్ రంగంలోకి వెళ్లిన శోభిత 2013లో జరిగిన మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని తృటిలో కిరీటాన్ని చేజార్చుకుంది. ఇక అదే ఏడాది మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొంది. దాంతో శోభితకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది.
‘రామన్ రాఘవ్ 2.0’ అనే హిందీ చిత్రంతో నటిగా మారిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ‘చెఫ్’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలలో నటించింది. ఇక అడివి శేష్ ‘గూఢచారి’ మూవీతో శోభిత ధూళిపాళ్ల టాలీవుడ్లోకి వచ్చింది. ఈ సినిమాలో తన అందం, పర్ఫార్మెన్స్తో అదరగొట్టింది. ఈ సినిమా హిట్ అయిన శోభితకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. చాలా రోజుల తర్వాత ‘మేజర్’తో తెలుగు చిత్రంలో కనిపించి మెప్పించిన కూడా..ఎందుకో ఈ అమ్మడికి అవకాశాలు ఇవ్వడం లేదు. శోభిత తన కెరీర్లో అదిరిపోయే హాట్ షో చేసింది. అలాగే, రొమాంటిక్ సీన్స్‌లోనూ నటించింది. ‘మంకీ మ్యాన్’ అనే హాలీవుడ్ మూవీలో ఈ చిన్నది వేశ్య పాత్రలో కనిపించింది.
గ్లామర్ షోకు చిరునామాగా శోభిత ధూళిపాళ్ల ఎన్నో ఏళ్లుగా రచ్చ చేస్తుంది. అక్కినేని నాగ చైతన్యని వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారాక కూడా శోభిత అందాలను ఆరబోస్తూ రచ్చ లేపుతోంది. ఇందులో భాగంగానే తనదైన గ్లామర్‌ను చూపిస్తూ తీసుకున్న హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తద్వారా ఈ బ్యూటీ తరచూ ట్రెండ్ అవుతూ నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉంటుంది. శోభిత ధూళిపాళ్ల తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో నైట్ వేర్ డ్రెస్ ధరించి రచ్చ లేపుతుంది. శోభిత షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చి పిక్స్ వైరల్‌గా మారుతున్నాయి.