Naga Chaitanya – Shobitha Dhulipala | టాలీవుడ్ నటుడు నాగచైతన్య (Naga Chaitanya), తెలుగు బ్యూటీ శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. సమంతతో విడిపోయిన అనంతరం శోభితాతో ప్రేమలో పడ్డాడు నాగా చైతన్య. రీసెంట్గా వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే తాజాగా వీళ్లిద్దరు కలిసి ఒక సెల్ఫీ దిగారు. కొత్త లుక్లో ఇద్దరు మెరిసిపోయారు. ఇక ఈ ఫొటోకు ‘‘ఎవ్రిథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్గా మారింది.
సినిమాల విషయానికి వస్తే.. లవ్ సితార అంటూ రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala). ఈ చిత్రం ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. నాగ చైతన్య విషయానికి వస్తే.. ప్రస్తుతం చందూ మొండేటితో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది.
Hot couple alert! 🫶🏽#NagaChaitanya shares a lovely photo with fiancé #SobhitaDhulipala post their engagement.#trending pic.twitter.com/BuFhkVWRJf
— Filmfare (@filmfare) October 19, 2024