గతంలో యాక్టర్లు వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలను పంచుకునేందుకు అంతగా ఇష్టపడేవారు కాదు. కానీ ఇపుడు ట్రెండ్ మారింది. చాలా మంది యాక్టర్లు తమ వ్యక్తిగత విశేషాలను నిర్మొహమాటంగా చెప్పడం కానీ, తిరస్కరించడం కానీ చేస్తున్నారు. అయితే సమంతతో విడాకుల తర్వాత చైతూ నటి శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala)తో డేటింగ్లో ఉన్నాడంటూ వార్తలు నెట్టింట షికారు చేస్తున్నాయి. గత నెలలో లండన్‌లో నాగచైతన్య-శోభిత ఒక్కచోట కనిపించిన స్టిల్ ఇప్పుటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య (Naga Chaitanya) గురించి ప్రశ్నించగా.. నిర్మొహమాటంగా తిరస్కరించింది శోభితా ధూళిపాళ. వీరిద్దరి డేటింగ్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, రిలేషన్షిప్ విషయం గురించి సీరియస్‌గా ఫిక్సయ్యే వరకు ప్రజలకు కానీ, మీడియాకు కానీ చెప్పే అవకాశాలు కానీ లేవంటూ కథనాలు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తున్నాయి.
నాగచైతన్య-శోభిత ఓ మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నారని టాక్. రాబోయే రోజుల్లో ఈ క్రేజీ డేటింగ్ న్యూస్ నిజమౌతుందా..? లేదంటే గాసిప్‌గానే మిగిలిపోతుందా..? అనేది చూడాలి మరి. శోభితా ధూళిపాళ గతేడాది భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్-1లో మెరిసింది. మరోవైపు నాగచైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు డైరెక్షన్లో కస్టడీ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే విడుదలై గ్లింప్స్ వీడియోకు మంచి స్పందన వస్తోంది.