కార్తీ నటించిన ‘సర్దార్’ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయం సాధించింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌గా ‘సర్దార్-2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున ఈ సినిమా ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్నది.
ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ వెలువడింది. ఇందులో ఎస్.జె.సూర్య పవర్ఫుల్ రోల్లో నటించబోతున్నారు. ఆయన పాత్ర కథలో కీలకంగా ఉంటుందని, భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌శంకర్‌రాజా, నిర్మాత: ఎస్.లక్ష్మణ్ కుమార్, దర్శకత్వం: పీఎస్ మిత్రన్.