Sai Pallavi | సినిమా వేడుకల్లో సాయిపల్లవి కనిపిస్తే, జనానికి వేరే సెలబ్రిటీలతో పనుండదు. ఆ వేడుక అంతా సాయిపల్లవి మేనియాతో నిండిపోవాల్సిందే. ఆడియన్స్‌కే కాదు, వేదికపై ఉండే సెలబ్రిటీలకు కూడా సాయిపల్లవి జపమే. ప్రసుత్తం ఆమె దశ అలా ఉంది. శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘అమరన్’ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా చెన్నయ్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో సాయిపల్లవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేదికపై ఆమె కనిపించగానే, తమిళ జనాలకు పూనకాలు వచ్చేశాయి.
పైగా, హీరో శివకార్తికేయన్ నుంచి అతిథిగా విచ్చేసిన లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం వరకూ సాయిపల్లవిని పొగడ్తలతో ముంచెత్తారు. మణిరత్నం అయితే.. ఒకడుగు ముందుకేసి, ‘నేను సాయిపల్లవి అభిమానిని. ఆమెతో సినిమా చేయాలనుంది. తప్పకుండా చేస్తా..’ అని వేలాది జనాల సాక్షిగా చెప్పేశారు. సాధారణంగా మణిరత్నం దర్శకత్వంలో నటించాలని హీరోయిన్లందరూ కలలు కంటుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఇక ‘అమరన్’ సినిమా విషయానికొస్తే.. ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా ఈ సినిమా రూపొందింది. ఇందులో ముకుంద్ వరదరాజన్‌గా శివకార్తికేయన్ నటించగా, కథలో కీలకమైన ఆయన భార్య పాత్రను సాయిపల్లవి పోషించింది.