Prince Trailer | ఫన్, సీరియస్ ట్రాక్‌తో శివకార్తికేయన్ ప్రిన్స్ ట్రైలర్..వీడియో
కోలీవుడ్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తున్న తాజా చిత్రం ప్రిన్స్ (Prince)ట్రైలర్ ను మేకర్స్ లాంఛ్ చేశారు. జాతిరత్నాలు ఫేం అనుదీప్ కేవీ (Anudeep KV) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఉక్రెయిన్ భామ మరినా ర్యాబొశప్క హీరోయిన్గా నటిస్తోంది.
కోలీవుడ్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తున్న తాజా చిత్రం ప్రిన్స్ (Prince). జాతిరత్నాలు ఫేం అనుదీప్ కేవీ (Anudeep KV) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఉక్రెయిన్ భామ మరినా ర్యాబొశప్క హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ (Prince Trailer)ను లాంఛ్ చేశారు.
ఫన్, సీరియస్ ట్రాక్‌తో కులం, మతం కోసం ఇంకా కొట్టుకుంటున్నారేంట్రా..మనందరికీ ఒకటే రక్తం రా అనే డైలాగ్స్ తో మొదలైంది ట్రైలర్. శివకార్తికేయన్ టీచర్‌గా పనిచేస్తున్నస్కూల్లోనే హీరోయిన్ కూడా టీచర్‌గా చేరుతుంది. స్కూల్ జర్నీ టైంలో హీరోను ఇష్టపడుతుంది. అక్కడే అస్సలు సమస్య మొదలవుతుంది.
ఒక ఇండియన్..ఒక బ్రిటీష్ అమ్మాయిని ప్రేమించడాన్ని స్థానికంగా ఉండేవారు అభ్యంతర వ్యక్తం చేస్తారు. ఈ క్రమంలో ఇద్దరి ప్రేమ ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగిందనేది ట్రైలర్లో సస్పెన్స్‌లో పెడుతూ..సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాడు అనుదీప్ కేవీ.
ఈ చిత్రంలో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఫన్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, సురేశ్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు, సురేశ్ బాబు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. శివకార్తికేయన్‌కు మొదటి తెలుగు స్ట్రెయిట్ సినిమా ఇదే. ప్రిన్స్‌కు ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్.
Read Also : Trivikram Srinivas | త్రివిక్రమ్ మొదటి సినిమా స్పెషల్ షో..వివరాలివే..!
Read Also : Ram Charan | రాంచరణ్ కొత్త లుక్ వైరల్..నెటిజన్లు ఇంప్రెస్
Read Also : Simbu | ‘కేజీఎఫ్’ నిర్మాణ సంస్థలో.. శింబు భారీ బడ్జెట్ సినిమా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

