Sivakarthikeyan ‘Don’ Release date | తమిళ హీరో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘రెమో’ సినిమాతో తెలుగులో కూడా ఈయన మంచి క్రేజ్‌ను ఏర్పరచుకున్నాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈయన సినిమాలు ఏకకాలంలో విడుదలవుతుంటాయి. గతేడాది ‘డాక్టర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించాడు. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘డాన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. సిబి చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాజాగా విడుదల తేదీని ప్రకటించింది.
యాక్షన్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 13న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం విడుదల కానుంది. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. ఎస్.జే సూర్య కీలకపాత్రలో నటించనున్నాడు. ఇప్టటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ గ్లింప్స్ సినిమాపైన మంచి అంచనాలను నమోదు చేశాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రం విడుదలకు ఒకరోజు ముందు మహేష్‌బాబు నటించిన సర్కారువారి పాట విడుదల కానుంది. మరి సర్కారు వారి పాట పోటీని తట్టుకొని తెలుగు రాష్ట్రాల్లో డాన్ చిత్రం నిలుస్తుందో లేదో చూడాలి మరి.