Maaveeran Movie Trailer | డాక్టర్, డాన్ వంటి వరుస వంద కోట్ల సినిమాల తర్వాత శివ కార్తికేయన్‌కు ప్రిన్స్ రూపంలో డిజాస్టర్ వచ్చి చేరింది. శివ కార్తికేయన్‌కు తొలి తెలుగు సినిమా ఇదే. ఇక ఈ సినిమా ఫలితాన్ని శివ కార్తికేయన్ సైతం ఎలాంటి భేషాజాలంకు పోకుండా ఒప్పేసుకున్నాడు. జాతిరత్నాలు వంటి బంపర్ హిట్ తర్వాత అనుదీప్ చేసిన సినిమా కావడంతో రిలీజ్‌కు ముందు సినిమాపై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ అయింది. తీరా రిలీజయ్యాక అంచనాలు అందుకోలేక బొక్క బోర్లా పడింది. అయితే తమిళంలో మాత్రం ఈ సినిమాకు పర్వాలేదనిపించే కలెక్షన్లే వచ్చాయి. ప్రస్తుతం శివ కార్తికేయన్ మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో మహావీరుడు ఒకటి.
మండేలా వంటి ప్రయోగాత్మక సినిమాతో తమిళ ప్రేక్షకుల మన్నన పొందిన మడోన్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్లు గట్రా సినిమాపై కాస్త మంచి బజ్నే తీసుకొచ్చాయి. ఇక ఈ సినిమా జూలై 14న తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా మావీరన్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌తోనే సినిమా కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందో అని మేకర్స్ ఓ చిన్న క్లారిటీ ఇచ్చారు. అత్యంత పిరికివాడైన ఓ కుర్రాడు.. తనకు ఎదురైన సంఘటనల వల్ల ధైర్యవంతుడిగా ఎలా మారాడు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్‌తో స్పష్టమయింది. అమాయకుడిగా ఏ స్థాయిలో వినోదాన్ని పంచాడో.. బలవంతుడయ్యాక ప్రత్యర్థులను మట్టుపెట్టడంలో ఏ రేంజ్లో చెలరేగిపోయాడని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
డైరెక్టర్ మిస్కిన్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించాడు. రాజకీయ నాయకుడిగా తన పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. మన నటుడు సునీల్‌కు కూడా ఈ సినిమాలో మంచి పాత్రే పడ్డట్లు తెలుస్తుంది. ఇక శంకర్ కూతురు అతిధి, శివకు జోడీగా పర్ఫెక్ట్గా సెట్టయింది. నాటి నటి సరిత హీరోకు తల్లిగా కనిపించనుంది. ట్రైలర్ అంచనాలు పెంచే విధంగానే ఉంది. అయితే తెలుగులో ఈ సినిమా ట్రైలర్ ఇంకా రిలీజ్ కాలేదు. మరో రెండు, మూడు రోజుల్లో తెలుగు ట్రైలర్‌కు సంబంధించిన అప్డేట్ రావొచ్చు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.