Sita Ramam Movie | ఉత్తమ చిత్రంగా సీతారామం.. క్లాసికల్ లవ్‌స్టోరీకి అరుదైన పురస్కారం
Sita Ramam Movie | కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాల్లేకుండా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు సాధిస్తుంటాయి. అందులో 'సీతారామం' ఒకటి. ఈ సినిమా దర్శకుడు హను రాఘవపూడికి ఈ సినిమాకు ఉంది చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డు లేదు.
Sita Ramam Movie | కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాల్లేకుండా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు సాధిస్తుంటాయి. అందులో ‘సీతారామం’ ఒకటి. ఈ మూవీ దర్శకుడు హను రాఘవపూడికి ఈ సినిమాకు ఉంది చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డు లేదు. ఇక దుల్కర్‌కు క్రేజ్ ఉంది కానీ, మరీ హీరోగా కోట్లు కొల్లగొట్టేంత క్రేజ్ లేదు. పైగా ఇక్కడ ఆయనకు అంత మార్కెట్ కూడా లేదు. ఇక మృనాళ్ థాకూర్‌ను చూడటమే మొదటి సారి. కాస్తో కూస్తో ఈ సినిమాపై బజ్ వచ్చిందంటే దానికి రష్మిక మందనే కారణం. ఇక విడుదలకు ముందు టీజర్, ట్రైలర్లకు కూడా మరీ పెద్ద హైప్ ఏమీ తీసుకురాలేదు.
కట్ చేస్తే తొలిరోజే రికార్డు స్థాయిలో కలెక్షన్లు. దుల్కర్, మృనాళ్ నటనకు తెలుగు ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. డైరెక్టర్ హను టేకింగ్, విజన్‌కు ఫిదా అయిపోయారు. చాలా కాలం తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్‌తో థియేటర్లు కిక్కిరిపోయాయి. విమర్శకులు ప్రశంసలు పొందిన ఈ సినిమా కలెక్షన్లలోనూ రికార్డులు సృష్టించింది. ఇక తాజాగా ఈ సినిమా అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సీతారామం మూవీ గెలుచుకుంది.
పదమూడవ దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషన్ ఫిలిం ఫెస్టివల్లో జ్యూరి కేటగిరీలో సీతారామం ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. కల్ట్ క్లాసికల్ లవ్‌స్టోరీగా నిలిచిన ఈ సినిమాకు ఇంత గొప్ప అవార్డు రావడంతో చిత్రబృందం సంబురాల్లో మునిగిపోయింది. ఇక ఇదే ఫెస్టివల్లో సంగీత దర్శకుడు భీమ్స్ బలగం సినిమాకు గానూ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

