Single Movie OTT | టాలీవుడ్ యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ సింగిల్() చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకత్వం వహించాడు. గీతా ఆర్ట్స్ పతాకంపై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మాతలుగా వ్యవహారించారు. వెన్నెల కిశోర్, వీటీవీ గణేష్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. మే 09న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విజయ్(శ్రీవిష్ణు) ఓ బ్యాంక్‌లో ఉద్యోగి. తోటివారంతా లవర్స్‌తో సెటిలైపోతుంటే.. తానుమాత్రం ఇంకా సింగిల్‌గానే ఉండటం విజయ్ భరించలేకపోతుంటాడు. అలాంటి సందర్భంలో తనకు పూర్వ(కేతిక) తారసపడుతుంది. తొలి ప్రేమలోనే తను ప్రేమలో పడిపోతాడు. ఆమెను ప్రేమలో పడేసేందుకు సమస్త ప్రయత్నాలూ చేస్తుంటాడు. ఇదిలావుంటే.. హరిణి(ఇవానా) అనే డాన్స్ టీచర్ విజయ్‌ని ప్రేమిస్తూ వుంటుంది. విజయ్‌ని ఎలాగైనా ప్రేమలో పడేసేందుకు తను ప్రయత్నిస్తుంటుంది. మరి పూర్వని విజయ్ ప్రేమలో పడేశాడా? హరిణి ప్రయత్నం సఫలం అయ్యిందా? హరిణి, విజయ్ ఇద్దరిలో ఎవరి ప్రేమ గెలిచింది? ప్రేమ అంటూ గెలిస్తే.. మరి ఈ సినిమాకు ‘సింగిల్’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మిగతా కథ.