Singer Mangli | ప్రముఖ నేపథ్య గాయని (playback singer) మంగ్లీ (Mangli)కి తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును డీసీఎం వాహనం వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది (Car accident). ఈ ప్రమాదంలో మంగ్లీ సహా కారులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారి (Hyderabad-Bengaluru Highway)పై తొండుపల్లి వంతెన వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు శంషాబాద్ పోలీసులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో నిర్వహించిన ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరయ్యారు. కార్యక్రమం పూర్తి చేసుకొని అర్ధరాత్రి సమయంలో మేఘ్రాజ్, మనోహర్‌తో కలిసి ఆమె కారులో ఇంటికి బయల్దేరారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన వద్దకు రాగానే కర్ణాటకకు చెందిన ఓ డీసీఎం వాహనం వెనుక నుంచి వేగంగా మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యారు. కారు వెనుక భాగం కూడా పూర్తిగా దెబ్బతినింది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
Also Read..
Railing Collapses | ముందస్తు హోలీ వేడుకల్లో అపశృతి.. ఆలయంలో రెయిలింగ్ కూలి 22 మందికి గాయాలు
Arvind Kejriwal | ఢిల్లీ జల బోర్డు కేసు.. ఈడీ విచారణకు కేజ్రీవాల్ మరోసారి డుమ్మా
MLC Kavitha | దర్యాప్తు సంస్థపై చర్యలు తీసుకోండి.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్