MLC Kavitha | దర్యాప్తు సంస్థపై చర్యలు తీసుకోండి.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్
సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే తనను అరెస్టు చేశారని, దర్యాప్తు సంస్థ కోర్టుకు ధిక్కరణకు పాల్పడిందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే తనను అరెస్టు చేశారని, దర్యాప్తు సంస్థ కోర్టుకు ధిక్కరణకు పాల్పడిందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీచేయబోమని కోర్టుకు చెపి అక్రమంగా తనను అరెస్టు చేశారని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు సోమవారం ఉదయం 6.30 గంటలకు ఆన్లైన్లో పిటిషన్ వేశారు.
కాగా, ఆదివారం ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారించారు. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చినట్టుసమాచారం. విచారణను అధికారులు వీడియో రికార్డు చేసినట్టు తెలిసింది. విచారణ అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఆమె భర్త అనిల్, న్యాయవాది మోహిత్‌రావు కవితను కలిశారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్తూనే తనపై మోపిన అభియోగాలన్నీ అభియోగాలుగానే మిగిలిపోతాయని, తాను కడిగిన ముత్యంలా బయటికొస్తానని ఆమె వారితో పేర్కొన్నట్టు సమాచారం. కాగా, సోమవారం ఎమ్మెల్సీ కవిత సమీప బంధువులు, ఆమె వ్యక్తిగత సిబ్బంది కొందరు ఆమెను కలిసే అవకాశం ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

