Thug Life audio launch | కమల్‌హాసన్ కథానాయకుడిగా వస్తున్న ‘థగ్ లైఫ్’ సినిమా ఆడియో లాంచ్ వేడుకలో నటుడు సిలంబరసన్ టి.ఆర్. (STR) దర్శకుడు మణిరత్నం, సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్‌లకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
సిలంబరసన్ మాట్లాడుతూ.. తన కెరీర్లో కష్టదశలో ఉన్నప్పుడు, మణిరత్నం తన ‘చికా చివంత వానమ్’ చిత్రంలో అవకాశం ఇచ్చి తన రీఎంట్రీకి మార్గం సుగమం చేశారని తెలిపారు. అలాగే, “బీప్ సాంగ్” వివాదం వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ.ఆర్. రెహమాన్ తనకు ‘తల్లి పోగతే’ వంటి అద్భుతమైన పాటలతో అండగా నిలిచారని, వారిద్దరి మద్దతు తనకెంతో విలువైనదని సిలంబరసన్ పేర్కొన్నారు. అలాగే కమల్ హాసన్ వినయం తనకెంతో స్ఫూర్తినిచ్చిందని, ‘థగ్ లైఫ్’ ఒక కలల ప్రాజెక్ట్ అని STR అభివర్ణించారు. చెన్నైలోని సాయిరామ్ కాలేజీలో జరిగిన ఈ ఆడియో లాంచ్ వేడుకలో మణిరత్నం, ఏ.ఆర్. రెహమాన్, త్రిష, అభిరామి వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది.