సందీప్ కిషన్ నటించిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘సిగ్మా’. తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈచిత్రాన్ని లైకా ప్రొడక్షన్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. మైత్రీమూవీమేకర్స్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాయి.
తను కోల్పోయిన దాన్ని తిరిగి సాధించేందుకు ఓ వ్యక్తి చేసిన పోరాటమే ఈ సినిమా అని, డ్రగ్స్, గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన 500కోట్ల భారీ రాకెట్ ఈ కథలో కీలకమని మేకర్స్ తెలిపారు. యాక్షన్ అడ్వెంచర్, ఫన్, ఎమోషన్ అంశాలతో జేసన్ సంజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
తల్లీకొడుకు ఎమోషన్ ఈ సినిమాకు ప్రధాన బలమని తెలుస్తున్నది. ఫరియా అబ్దుల్లా ఇందులో కథానాయిక. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో రాజు సుందరం, శివ పండిట్, అన్బు తాసన్ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: కృష్ణన్ వసంత్, సంగీతం: ఎస్.థమన్.