Sidhu Jonnalagadda | ఈ ఏడాది ‘టిల్లు స్కేర్’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ప్రస్తుతం ఆయన ‘జాక్-కొంచెం క్రాక్’ సినిమాలో నటిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వ వహిస్తున్న ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వైష్ణవి చైతన్య కథానాయిక. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సందర్భంగా బుధవారం కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఎనభైశాతం చిత్రీకరణ పూర్తయిందని, ఆద్యంతం హాస్యప్రధానంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని, ఆయన శైలి కామెడీ, మేనరిజమ్స్‌తో అందరిని ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. ప్రకాష్‌రాజ్, నరేష్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతాన్నందిస్తున్నారు.