టిల్లు స్క్వైర్ గ్లింప్స్ రిలీజ్.. మళ్లీ రాధిక మ్యాజిక్ రిపీట్ కానుందా!
‘డీజే టిల్లూ’గా సిద్ధు జొన్నలగడ్డ చూపించిన గ్రేసూ, హైపర్ యాక్టీవ్‌నెస్ జనాలకు విపరీతంగా నచ్చేసింది. ఆ తరహా పాత్ర అంటే తానే గుర్తొచ్చేంత గొప్పగా నటించారు సిద్ధు. అందుకే ‘టిల్లు స్కేర్'కి అంత హైప్. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు విశేషమైన స్పందన లభిస్తున్నది.
‘డీజే టిల్లూ’గా సిద్ధు జొన్నలగడ్డ చూపించిన గ్రేసూ, హైపర్ యాక్టీవ్‌నెస్ జనాలకు విపరీతంగా నచ్చేసింది. ఆ తరహా పాత్ర అంటే తానే గుర్తొచ్చేంత గొప్పగా నటించారు సిద్ధు. అందుకే ‘టిల్లు స్కేర్’కి అంత హైప్. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు విశేషమైన స్పందన లభిస్తున్నది. సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు.
రాత్రి సమయంలో కారు నడుపుతూ లిల్లీ పాత్రలో ఉన్న అనుపమ పరమేశ్వరన్ నుంచి ముద్దును పొందడం, తన గత పుట్టినరోజు గురించి లిల్లీ అడగగా రాధికతో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకోవడం ఈ గ్లింప్స్‌లో హైలైట్స్. ప్రేమికులరోజు సందర్భంగా ఈ నెల 14న ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. మల్లిక్‌రామ్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలావుంటే.. ఈ సినిమా తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు సిద్ధూ. ఆ సినిమాకు ‘జాక్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘కొంచెం క్రాక్’ అనేది ఉపశీర్షిక. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ సినిమా మోషన్ పోస్టర్ని కూడా సిద్ధు పుట్టిన రోజు సందర్భంలోనే మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలోని సిద్ధూ పాత్ర చిత్రణ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పేలా ఉంది ఈ పోస్టర్. డబుల్ గన్.. డబుల్ ఫన్ అనేలా ఈ చిత్రం ఉండబోతుందని, యువతరంతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా నచ్చేలా బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని నిర్మాత చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

