AMMA : మలయాళీ సీనియర్ నటి, ‘రతి నిర్వేదం’ ఫేమ్ శ్వేతా మీనన్ (Shwetha Menon) అరుదైన ఘనత సాధించింది. ఓవైపు పోలీస్ కేసును ఎదుర్కొంటూనే .. ‘మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ మూవీ ఆర్టిస్ట్స్’ (AMMA) సంఘం ఎన్నికల బరిలో నిలిచిన ఆమె అధ్యక్షురాలిగా జయకేతనం ఎగురవేసింది. తద్వారా ‘అమ్మా’ చరిత్రలో ప్రెసిడెంట్ పదవి చేపట్టనున్న తొలి మహిళగా శ్వేత రికార్డు నెలకొల్పింది. ఉపాధ్యక్షురాలిగా లక్ష్మి ప్రియ, జాయింట్ సెక్రటరీగా కుక్కు పరమేశ్వరన్, జెనరల్ సెక్రటరీగా అన్సిబ హసన్ ఎంపికయ్యారు.
జస్టిస్ హేమా కమిటీ రిపోర్టు.. తదనంతర పరిణామాల నేపథ్యంలో ఏడాది తర్వాత అమ్మా సంఘం ఎన్నికలు జరిగాయి. ఆగస్టు 15, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు ఫలితాలను ప్రకటించారు. ప్రచారం నుంచి పోలింగ్ తేదీ వరకూ పరస్పర విమర్శలు, వివాదాలకు కేరాఫ్‌గా నిలిచాయి ఈ ఎన్నికలు. మలయాళం చిత్ర పరిశ్రమలో ఈ తరహాలో ఎలక్షన్స్ జరగడం ఇదే మొదటిసారి. సభ్యులుగా ఉన్న 506 మందిలో 298 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
First Woman President Of A.M.M.A 📽️
Shwetha Menon pic.twitter.com/caVVJMlQUL
— Kerala Trends (@KeralaTrends2) August 15, 2025
మమ్ముట్టి, ఫాహద్ ఫాజిల్, పృథ్వీరాజ్ సుకుమార్, నివిన్ పౌలీ వంటి స్టార్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లలేదు. గత ఎన్నికల్లో 70 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి 58 శాతమే రికార్డు అయింది. అయితే.. ఎన్నికలకు ముందే శ్వేతపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆమె ఉద్దేశపూర్వకంగానే అసభ్యకరమైన చిత్రాల్లో, ప్రకటనల్లో నటించిందని ఎర్నాకులంలోని సెంట్రల్ పోలీస్ స్టేషన్లో కేసు వేశారు కొందరు. దాంతో, శ్వేత కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమణులపై, మహిళా ఆర్టిస్టులపై వేధింపులు, కాస్టింగ్ కౌచ్ విషయాల్ని బహిర్గం చేసిన జస్టిస్ హేమా కమిటీ నివేదిక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ రిపోర్టులో ప్రస్తావించిన అంశాలపై పెద్ద దుమారమే రేగింది. మోహన్ లాల్ నేతృత్వంలో కమిటీపై తీవ్ర విమర్శలు రావడంతో నిరుడు ఆగస్టు 27న సభ్యులందరూ రాజీనామా చేశారు.
Actress Shwetha Menon has been elected as the president of the Association of Malayalam Movie Artists (#AMMA), making history as the first woman to hold the top post.
Kukku Parameswaran was elected as the general secretary, defeating Ravindran, who had also contested for the… pic.twitter.com/pkJMBSpvdF
— South First (@TheSouthfirst) August 15, 2025