SAINDHAV | టాలీవుడ్ హీరో వెంకటేశ్ (Venkatesh) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం సైంధవ్ (SAINDHAV). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రాన్ని హిట్ ఫేం శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది వెంకీ టీం. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో మొదలైన సెకండ్ షెడ్యూల్ నేటితో పూర్తయింది. శ్రద్దాశ్రీనాథ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని అందరితో షేర్ చేసుకుంది. ఈ చిత్రంలో రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రుహానీ శర్మ (Ruhani sharma) సైంధవ్ మిషన్‌లో కీలక పాత్ర పోషించే వ్యక్తిగా నటిస్తోంది. సైంధవ్ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన శ్రద్దా శ్రీనాథ్, రుహానీ శర్మకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సైంధవ్‌లో నవాజుద్దీన్ సిద్దిఖీ వికాస్ మాలిక్ పాత్రలో నటిస్తున్నాడు. వెంకటేశ్ 75వ సినిమాగా వస్తోన్న సైంధవ్ గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా నేపథ్యంలో సాగే కథాంశంతో వస్తున్న సైంధవ్ పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ చిత్రాన్ని 2023 డిసెంబర్ 22న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సైంధవ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి తెరకెక్కిస్తున్నారు. సైంధవ్‌కు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
సైంధవ్ గ్లింప్స్ వీడియో..