అందమైన రూపమే కాదు అందమైన మనసూ తమకుందని చాటుతుంటారు నాయికలు. తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుంటారు. అలాంటి తారల్లో శ్రద్ధా కపూర్ పేరూ వినిపిస్తుంటుంది. బాలీవుడ్ అగ్రతారగా వెలుగుతున్న ఈ భామ సందర్భం వచ్చినప్పుడు మంచి పనులు చేస్తూ అందరి దృషిని ఆకర్షిస్తుంటుంది. ఇటీవల వ్యాయామశాల నుంచి బయటకొచ్చిన శ్రద్ధా..ఆ జిమ్ బయట ఆడుకునే అనాథ పిల్లలకు స్వీట్లు, చాక్లెట్స్, కేక్స్ పంచిపెట్టింది. హీరోయిన్ను చూస్తే చాలనుకునే ఈ పిల్లలు..ఆమె స్వయంగా స్వీట్స్ పంచడంతో ఆనందపడ్డారు. శ్రద్ధా ఫ్రెండ్లీ పర్సన్, ఈ అనాథ పిల్లలకు మంచి ట్రీట్ ఇచ్చింది అంటూ ఆమె స్నేహితురాలు పేర్కొంది. ప్రస్తుతం శ్రద్ధా.. రణబీర్ కపూర్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నది. ఈ సినిమాకు లవ్ రంజన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే 32 రోజుల పాటు ఈ సినిమా స్పెయిన్, మారిషస్‌లో షూటింగ్ జరుపుకుంది. ఈ లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న టీమ్ స్వదేశంలో చిత్రీకరణకు సిద్ధమవుతున్నారు.