శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తక్కువ వయసులో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కన్నడ పవర్ స్టార్ గా అభిమానులతో పిలిపించుకునే పునీత్ రాజ్ కుమార్ (46) మరణ వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఆయన కుటుంబంతో పాటు అభిమానులు రోదిస్తున్నారు. పునీత్ తిరిగిరా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
అయితే పునీత్ మరణించి అప్పుడే నాలుగు రోజులు అయింది. సోమవారం పునీత్ పెద్దన్న, హీరో శివ రాజ్‌కుమార్ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పునీత్ మరణం మా కుటుంబానికి తీరని శోకం. అతడిని నా చేతులతో ఎత్తుకొని ఆడించాను. ఇలాంటి బాధ ఎవరికి రాకూడదు. పునీత్‌కు పాల శాస్త్రం చేయడం ఎంతవరకు సరి అనేది అర్థం కావడం లేదన్నారు. పాలశాస్త్రం తంతు ముగియగానే అభిమానులను కంఠీరవ స్టూడియోలో సమాధి వద్దకు అనుమతించటంపై సీఎంతో చర్చిస్తాన్నారు.
అభిమానులు కంఠీరవ స్టూడియో వద్ద సమాధిని చూడాలని పడిగాపులు కాస్తున్నారు. పోలీసులు వారిని అనుమతించడం లేదు. దీనిపై సీఎంతో మాట్లాడి ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని అన్నాడు శివరాజ్ కుమార్.