Gummadi Narasaiah | గుమ్మడి నర్సయ్యగా శివరాజ్‌కుమార్.. ఫస్ట్ లుక్‌తోనే హైప్ పెంచుతున్న డెబ్యూ డైరెక్టర్
gummadi narasaiah | నిజమైన రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి.. అనేలా ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది ఇల్లందుకు చెందిన గుమ్మడి నర్సయ్య ప్రస్థానం. ఇప్పుడు ఆయన బయోపిక్ సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనుంది.
Gummadi Narasaiah | పేద ప్రజల గురించి ఆలోచించే రాజకీయ వేత్తగా, ప్రజా నాయకుడిగా గుమ్మడి నర్సయ్యకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నిజమైన రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి.. అనేలా ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది ఇల్లందుకు చెందిన గుమ్మడి నర్సయ్య ప్రస్థానం. ఇప్పుడు ఆయన బయోపిక్ సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఈ చిత్రానికి గుమ్మడి నర్సయ్య (Gummadi Narasaiah) టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఆయన పేరునే టైటిల్‌గా ఫిక్స్ చేసి మొదటి ప్రయత్నంలోనే అందరి ఫోకస్ తనవైపునకు తిప్పుకుంటున్నాడు డైరెక్టర్.
కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్‌కుమార్ (Shiva rajkumar)కు తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్ బేస్ ఉందని తెలిసిందే. ఈ కరుణాడ చక్రవర్తి శివరాజ్‌కుమార్ గుమ్మడి నర్సయ్యగా కనిపించబోతున్నాడు. తెలుగు రంగు చొక్కా, ధోతిలో భుజాన ఎర్ర కండువా వేసుకుని సైకిల్‌ను తోసుకుంటూ వెళ్తున్నాడు. సైకిల్ హ్యాండిల్‌కు సీపీఐఎంఎల్ జెండాను చూడొచ్చు. అసెంబ్లీ ముందు నుంచి మిగిలిప ప్రజాప్రతినిధులంతా బుగ్గ కార్లలో వస్తుంటే.. గుమ్మడి నర్సయ్య మాత్రం సాదాసీదాగా సామాన్య వ్యక్తిలా సైకిల్‌తో రావడం గమనించవచ్చు.
ఫస్ట్ లుక్‌తోనే సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తూ.. అందరినీ ఆలోచింపజేసేలా సినిమా ఉండబోతున్నట్టు తెలియజేశాడు డైరెక్టర్ పరమేశ్ హివ్రాలే. ఈ చిత్రాన్ని ప్రవళ్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్ సురేశ్ రెడ్డి నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. చిరు గొడవలు, లావణ్య విత్ లవ్ బాయ్స్ సినిమాల్లో నటించిన పరమేశ్ హివ్రాలే ఈ సినిమాతో డైరెక్టర్‌గా మారుతుండటంతో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
Presenting the First Look of ‘Karunada Chakravarthy’ Sri @NimmaShivanna’s ambitious project #GummadiNarasaiah ❤️🔥
A powerful glimpse of an extraordinary and inspirational journey. 🔥
A @parameshhivrale directorial
Produced by @Pravallika_Arts Production No.1 #NSureshReddy #NSR… pic.twitter.com/qFf1tuiFTG— BA Raju’s Team (@baraju_SuperHit) October 22, 2025
Read Also :
Deepika Padukone | ప్రపంచానికి తన కూతురిని పరిచయం చేసిన దీపికా పదుకొణే.. పాప ఎంత క్యూట్‌గా ఉంది.!
Kotha Lokah Movie | ‘కొత్త లోక’ని తెలుగులో తీస్తే డిజాస్టర్ అయ్యేది : నిర్మాత నాగవంశీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

