Manu Charitra | టాలీవుడ్ (Tollywood) యువ హీరో శివ కందుకూరి (Shiva Kandukuri) నటిస్తున్న చిత్రం మను చరిత్ర (Manu Charitra). రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో మేఘా ఆకాశ్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. డెబ్యూ డైరెక్టర్ భరత్ పెడగాని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు.
శివ కందుకూరి వివిధ వయస్సుల్లో పలువురు అమ్మాయిలతో ప్రేమలో పడటం, ఆ తర్వాత పలు కారణాలతో వారితో బ్రేకప్ అవడం, శివను చంపేద్దామని చూసే శత్రువుల చుట్టూ తిరిగే కథాంశంతో సినిమా రాబోతున్నట్టు ట్రైలర్ ద్వారా చెప్పాడు డైరెక్టర్. ఈ చిత్రాన్ని యాపిల్ ట్రీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై ఎన్ శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. గోపీసుందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రం జూన్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
మను చరిత్ర ట్రైలర్..