టాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న క్రేజీ సినిమాల్లో ఒకటి కృష్ణ వృంద విహారి (Krishna Vrinda Vihari). ఈ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతుంది న్యూజిలాండ్ సింగర్, నటి షిర్లే సెటియా (Shirley Setia). ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. హీరో నాగశౌర్య (Naga Shaurya) హీరోగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఏముంది రా (Emundi Ra) సాంగ్‌ను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఇదే పాటకు క్యూట్ హీరోయిన్ షిర్లే సెటియా మరోసారి తన డ్యాన్స్ పార్ట్నర్తో కలిసి క్లాసీ టచ్ ఇస్తూ అదిరిపోయే స్టెప్పులేసింది. వైట్ షార్ట్ డ్రెస్‌లో షిర్లే చేసిన డ్యాన్స్ ఇపుడు నెట్టింటిని షేక్ చేస్తోంది. అద్బుతమైన లిరిక్స్ తో హర్ష రాసిన ఈ పాటను హరిచరణ్ పాడగా..మ్యూజిక్ లవర్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. మహతి స్వరసాగర్ (Mahati Swara Sagar) కంపోజ్ చేసిన ఈ రొమాంటిక్ ట్రాక్ సినిమాకే హైలెట్ కానుందని సాంగ్ చూస్తే తెలిసిపోతుంది.
నాగశర్య హోం ప్రొడక్షన్స్ ఐరా క్రియేషన్స్ బ్యానర్ (Ira Creations) పై ఉషా మల్పూరి నిర్మిస్తున్నారు. అనిష్ ఆర్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం మే 20న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
Our Cutest Heroine @ShirleySetia participates in #EmundiRaHookStep 💃🏻
It's your turn now! Do it 🤘🏻🤩#EmundiRa #KrishnaVrindaVihari
▶️ https://t.co/kXm58wmVlA#KVV @IamNagashaurya #AnishKrishna #SaiSriram @mahathi_sagar @ira_creations @saregamasouth pic.twitter.com/QSo6CSKMRk— BA Raju's Team (@baraju_SuperHit) May 10, 2022