RJ Shekhar Basha | బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ బాషాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబర్ హర్ష సాయి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శేఖర్ బాషాను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. యూట్యూబ్ ఛానల్స్‌లో తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని శేఖర్ బాషాపై సైబర్ క్రైమ్ పోలీసులకు హర్ష సాయి బాధితురాలు ఫిర్యాదు చేసింది.
తెలుగు యూట్యూబర్ హర్ష సాయి తనను లైంగికంగా దాడి చేయడంతో పాటు మానసికంగా వేధించాడంటూ ఒక యువతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. హర్షసాయి తనపై పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని.. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని.. అలాగే తనను నమ్మించి రూ.2కోట్ల తీసుకొని మోసం చేసినట్లు యువతి పోలీసులను ఆశ్రయించింది. దాంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 376, 354, 328 కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో హర్ష సాయికి మద్దతుగా శేఖర్ బాషా మాట్లాడటంతో పాటు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని బాధిత యువతి శేఖర్ బాషాపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.