Shehzada Movie | మూడేళ్ల క్రీతం వచ్చిన ‘అలవైకుంఠపురంలో’ ఎంత పెద్ద విజయ సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను చెరిపేసి నాన్-బాహుబలిగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటికీ ఈ రికార్డు ఇంకా బద్ధలవ్వలేదు. ఒక సింపుల్ కథను త్రివిక్రమ్ మార్క్ టేకింగ్, డైలాగ్స్ ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. ఒక కూరను వండటం పూర్తయ్యాక చివరన కొత్తిమీర వేస్తే ఆ రుచే వేరు అన్నట్లు అలావైకుంఠపురం సినిమాకు థమన్ కొత్తిమీరలా రుచి దట్టించాడు. తన మ్యూజిక్‌తో మాయ చేశాడు. ఇక బన్నీతో సహా ఈ సినిమాలోని నటీనటులందరూ ది బెస్ట్ ఇచ్చారు. కట్‌చేస్తే రిలీజ్ రోజు నుంచి బాక్సాఫీస్‌పై దాడిచేసింది.
థియేటర్లోనే కాదు టీవీల్లో, ఓటీటీల్లోనూ ఈ సినిమా నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకున్నంత రిపీట్ వేల్యూ ఏ సినిమాకు లేదనడంలో అతిశయోక్తి లేదు. అంతలా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చేసింది. ఇలాంటి బ్లాక్‌బస్టర్ సినిమాకు రీమేక్‌లు తెరకెక్కడం సహజమే. కాగా ఇటీవలే ఈ సినిమాకు రీమేక్‌గా బాలీవుడ్లో ‘షెహజాదా’ అనే సినిమా తెరకెక్కింది. బన్నీ పాత్రలో కార్తిక్ ఆర్యన్ నటించగా.. పూజా పాత్రలో కృతిసనన్ నటించింది.
ఈ సినిమా పోస్టర్లు, టీజర్లు చూస్తే మనకంత ఇంట్రెస్ట్ కలిగించకపోయినా.. బాలీవుడ్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. దానికి తోడు భూల్భలయ్యా-2 వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత కార్తిక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో బాలీవుడ్లో అంచనాలు ఆకాశాన్నంటాయి. ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరి 10కి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ పఠాన్ ప్రవాహం ఇంకా కొనసాగుతుండటంతో వారం రోజులు పోస్ట్‌పోన్ చేశారు. ఇక శుక్రవారం భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా తొలిరోజే డివైడ్ టాక్ తెచ్చుకుంది. రోహిత్ శెట్టి దర్శకత్వం పేలవంగా ఉందని, బన్నీ గ్రేస్‌ను కార్తిక్ మ్యాచ్ చేయలేకపోయాడని ఒరిజినల్ వెర్షన్ చూసిన వాళ్లు చెప్పుకొచ్చారు.
ఓరిజినల్ వెర్షన్‌కు థమన్ సగంబలమైతే.. హిందీ వెర్షన్ ప్రితమ్ అందులో పావు వంతు అవుట్ పుట్ కూడా ఇవ్వలేకపోయాడు. టాక్ అనే కాదు కలెక్షన్లలోనూ షెహజాదా అలవైకుంఠపురం ఫస్ట్‌డేకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. ఇక షెహజాదా తొలిరోజు కేవలం రూ.6 కోట్ల నెట్ మాత్రమే సాధించింది. అలవైకుంఠపురంలో తొలిరోజే రూ.30 కోట్ల షేర్‌ను సాధించింది. ఏ లెక్కన చూసుకున్నా షెహజాదా, అలవైకుంఠపురం సినిమాకు పోలికే లేదు. అయినా భారీ బడ్జెట్‌తో రీమేక్‌లు చేసినంత మాత్రానా ఒరిజనల్ రేంజ్లో హిట్లవుతాయా ఏంటీ.