Sharwanand | హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘నారీ నారీ నడుమ మురారి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. శర్వానంద్ నటిస్తున్న 37వ చిత్రమిది. సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను అగ్ర నటులు బాలకృష్ణ, రామ్‌చరణ్ విడుదల చేశారు. ‘ముక్కోణపు ప్రేమకథా చిత్రమిది.
ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. శర్వానంద్ పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించబోతున్నాం’ అని మేకర్స్ తెలిపారు. సాక్షి వైద్య, సంయుక్త కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్, కథ: భాను భోగవరపు, సంగీతం: విశాల్‌చంద్రశేఖర్, నిర్మాణ సంస్థలు: ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు.