శర్వానంద్ ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందా..!

Sharwanand | భూమి గుండ్రంగా తిరుగుతున్నట్లుగా.. శర్వానంద్ కెరీర్ కూడా గుండ్రంగా తిరుగుతుంది. ఎక్కడ మొదలు పెట్టాడో మళ్లీ అక్కడికి వచ్చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఒకప్పుడు ఈయన చేసిన సినిమాలు బాగున్నాయనే కామెంట్స్ వచ్చినప్పటికీ కమర్షియల్ హిట్స్ మాత్రం వచ్చేవి కావు . అలాంటి సమయంలో రన్ రాజా రన్ అంటూ ఒక హిట్ కొట్టి.. ఆ తర్వాత వరుస విజయాలు అందుకొన్నాడు. కమర్షియల్‌గా తన రేంజ్ 15 కోట్లకు పైగా పెంచుకున్నాడు. శతమానం భవతి సినిమాతో ఏకంగా 33 కోట్లకి పైగా షేర్ వసూలు చేసి శర్వానంద్ మార్కెట్ అమాంతం పెంచేసింది.
2017 సంక్రాంతి శతమానం భవతి సినిమా విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ కెరీర్లో సూపర్ హిట్ లేదు. మధ్యలో విడుదలైన చాలా సినిమాలు అంచనాలను అందుకోలేక చతికిలపడ్డాయి. భారీ అంచనాలతో విడుదలైన జానూ, రణరంగం, శ్రీకారం లాంటి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఫ్లాపులు వచ్చినా కూడా సినిమాలు వరుసగా చేస్తూనే ఉన్నాడు శర్వానంద్. తాజాగా ఆయన నటించిన మహా సముద్రం దసరా కానుకగా విడుదలైంది. అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ మల్టీ స్టారర్ సినిమాలో సిద్ధార్థ మరో హీరోగా నటించాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కూడా నిరాశ పరిచేలా కనిపిస్తుంది. తొలి రోజు సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లపై భారీ ప్రభావం పడింది. ఈ సినిమా రెండు రోజుల్లో కేవలం 4.5 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే 17 కోట్లు వసూలు చేయాలి. కానీ రెండో రోజు పూర్తిగా చేతులెత్తేసింది మహా సముద్రం. దీంతో ఇప్పుడు శర్వానంద్ కెరీర్ మొదలుపెట్టిన దగ్గరకే వస్తుంది. కచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ అందుకుంటే తప్ప ఈయన మార్కెట్ మళ్లీ పుంజుకోవడం కష్టం. కథల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటేనే శర్వా మళ్లీ గాడిన పడతాడు.. లేదంటే చేతిలో ఉన్న కెరీర్ దిగజారినట్లే. మరి ఇలాంటి సమయంలో శర్వానంద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మహా సముద్రం 2 డేస్ కలెక్షన్స్.. చేతులెత్తేసిన శర్వానంద్ సినిమా..
పెళ్లి సందD ఫస్ట్ డే కలెక్షన్స్.. టాక్ తేడాగా ఉన్నా రోషన్ కుమ్మేసాడు..!
వరుణ్ డాక్టర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. క్లీన్ హిట్ కొట్టిన శివ కార్తికేయన్..
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఫస్ట్ డే ఏరియా వైజ్ కలెక్షన్స్..
రాజీనామాలతో బెదిరించలేరు.. నాకు చాలా పనులున్నాయంటున్న మంచు విష్ణు..
యాక్టర్స్ అంటే చిన్నచూపా.. శ్రీరామ్‌కు దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన నాగార్జున
Tollywood | దసరా విన్నర్ ఎవరు.. మూడు సినిమాల్లో ఏది బెటర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

