వరుణ్ డాక్టర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. క్లీన్ హిట్ కొట్టిన శివ కార్తికేయన్..

sivakarthikeyan varun doctor movie first week collections | మరో తమిళ హీరో తెలుగులో విజయం అందుకున్నాడు. ఆయనే శివ కార్తికేయన్. ఈయన నటించిన వరుణ్ డాక్టర్ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. బయ్యర్లకు మంచి లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. ఇదివరకు రెమో సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు శివ కార్తికేయన్ కానీ ఈయనకు కోరుకున్న మార్కెట్ మాత్రం ఓపెన్ కాలేదు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా వాటిని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటి సమయంలో ఈయన నటించిన సినిమా డాక్టర్. ఇదే సినిమాను తెలుగులో వరుణ్ డాక్టర్ పేరుతో విడుదల చేశారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈయన విజయ్ హీరోగా బీస్ట్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. వరుణ్ డాక్టర్ సినిమా కథ హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో సాగుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా.. అసలు విడుదల అవుతుందనే విషయం కూడా తెలియకుండా వచ్చిన ఈ చిత్రానికి అనూహ్యంగా మంచి కలెక్షన్స్ వచ్చాయి. అక్టోబర్ 9న విడుదలైన శివ కార్తికేయన్ వరుణ్ డాక్టర్ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు 1.55 కోట్ల షేర్ తో క్లీన్ హిట్ అందుకుంది వరుణ్ డాక్టర్.
నైజాం: 0.41 కోట్లు
సీడెడ్: 0.22 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.23 కోట్లు
ఈస్ట్: 0.16 కోట్లు
వెస్ట్: 0.13 కోట్లు
గుంటూరు: 0.14 కోట్లు
కృష్ణా: 0.15 కోట్లు
నెల్లూరు: 0.11 కోట్లు
ఏపీ + తెలంగాణ: 1.55 కోట్లు షేర్
వరుణ్ డాక్టర్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రూ.1.18 కోట్లకు అమ్మారు. అంటే 1.25 కోట్లు షేర్ వసూలు చేస్తే వరుణ్ డాక్టర్ హిట్ అనిపించుకుంటుంది. ఇప్పటి వరకు వారం రోజుల్లో 1.55 కోట్లు వసూలు చేసి.. ఇప్పటికే 30 లక్షలకు పైగా లాభాలు అందుకుంది వరుణ్ డాక్టర్. దాంతో శివకార్తికేయన్‌కు తెలుగులో కూడా మార్కెట్ ఓపెన్ అయిపోయినట్లే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పెళ్లి సందD ఫస్ట్ డే కలెక్షన్స్.. టాక్ తేడాగా ఉన్నా రోషన్ కుమ్మేసాడు..!
రాజీనామాలతో బెదిరించలేరు.. నాకు చాలా పనులున్నాయంటున్న మంచు విష్ణు..
యాక్టర్స్ అంటే చిన్నచూపా.. శ్రీరామ్‌కు దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన నాగార్జున
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఫస్ట్ డే ఏరియా వైజ్ కలెక్షన్స్..
Tollywood | దసరా విన్నర్ ఎవరు.. మూడు సినిమాల్లో ఏది బెటర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

