Sreerama Chandra in bigg boss 5 telugu | బిగ్ బాస్ ఇంట్లో ఎవరు ఏం చేసినా కూడా అన్నీ కెమెరా కళ్లు గమనిస్తూనే ఉంటాయి. దాంతో పాటు వీకెండ్లో నాగార్జున వస్తాడు. ఆ వారం అంతా వాళ్లు చేసిన తప్పులు ఎత్తి చూపిస్తూ సీరియస్ అవుతాడు. అంతేకాదు కొన్నిసార్లు శిక్షలు కూడా వేస్తాడు. అందుకనే నోరు చాలా అదుపులో పెట్టుకోవాలి అంటూ మిగిలిన ఇంటి సభ్యులు కూడా తన స్నేహితులకు చెబుతూ ఉంటారు. ఈ విషయంలో ఏ మాత్రం నోరు జారినా కూడా నాగార్జున ముందు వీకెండ్లో తల దించుకోక తప్పదు. ఇప్పుడు సింగర్ శ్రీ రామచంద్ర విషయంలో ఇదే జరిగింది. నామినేషన్స్ సమయంలో యాక్టర్స్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై అప్పుడే రియాక్ట్ అయ్యాడు షణ్ముఖ్ జస్వంత్. యాక్టర్స్ ను మాత్రమే పేరు పెట్టి అనడం కరెక్ట్ కాదు అంటూ ఫైట్ చేసాడు షణ్ను. ఇదే విషయంపై సింగర్ శ్రీ రామచంద్ర మీద ఇప్పుడు నాగార్జున కూడా సీరియస్ అయ్యాడు.
యాక్టర్స్ అందరూ అలాగే ఉంటారు అని చెప్పడం కరెక్ట్ కాదు అంటూ శ్రీరామ్‌కు క్లాస్ తీసుకున్నాడు నాగార్జున. నటులు అంటే అంత చిన్న చూపు ఎందుకు అంటూ ప్రశ్నించాడు. నేను సింగర్ బ్రో అంటూ చెప్పడం వల్ల యాక్టర్స్‌ను తక్కువ చేసి మాట్లాడుతున్నావా అంటూ అడిగాడు. నాకు నీలా నటించడం రాదు అనే మాట కూడా తప్పు అంటూ శ్రీరామ్ పై నాగార్జున మాటల తూటాలు పేల్చాడు. దానికి శ్రీరామ్ కూడా క్షమాపణ కోరాడు. మరోవైపు ఆని మాస్టర్‌పై కూడా నాగార్జున సీరియస్ అయ్యాడు. ప్రతి చిన్న విషయానికి బిడ్డ మీద ఒట్టు వేయడం ఎందుకు అంటూ ఆనీ మాస్టర్‌ను అడిగాడు నాగార్జున. సంచాలకులు చెప్పిన నిర్ణయం ఫైనల్ అని తెలిసిన తర్వాత ఎందుకు వాదిస్తున్నారు అంటూ ప్రశ్నించాడు. ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకూడదు అంటూ ఇంటి సభ్యులకు వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. కేవలం ప్రోమోలోనే ఇంత వేడి ఉంటే ఫుల్ ఎపిసోడ్లోఇంకెంత ఉంటుందో..?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
నువ్వు గుంటనక్కవే.. యాంకర్ రవిపై సీరియస్ అయిన నాగార్జున
Bigg Boss : ఈ వారం ఎలిమినేట్ కానుంది ఎవరో తెలుసా?
Bala Krishna: జబర్దస్త్ షోకి జడ్జిగా బాలకృష్ణ.. రోజా అడగడంతో నో అంటాడా మరి..!
Priyanka : సిరికి క్యారెక్టర్ లేదన్న షణ్ముఖ్.. అడిగి మరీ ప్రపోజ్ చేయించుకుంటున్న ప్రియాంక
Priyanka : మానస్‌తో మాట్లాడొద్దని ప్రియాంకకు శిక్ష విధించిన విశ్వ.. !
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. అఖిల్ టార్గెట్ అదుర్స్..