ముంబై: మూడు దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలిన సూపర్ స్టార్ అతడు. కింగ్ ఖాన్‌గా, బాలీవుడ్ బాద్షాగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కానీ ఇప్పుడో నిస్సహాయుడిగా మిగిలిపోయాడు. కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో షారుక్ ఖాన్ గుండె పగిలిందని, అతడు పూర్తి నిస్సహాయంగా మారిపోయాడని అతని సన్నిహితుడొకరు చెప్పాడు. ఆర్యన్‌ను ఎన్సీబీ అదుపులోకి తీసుకున్న రోజు నుంచి ఇప్పటి వరకూ షారుక్గానీ, భార్య గౌరీగానీ మీడియా కంట పడలేదు.
షారుక్ తీవ్ర దుఃఖంలో ఉన్నాడని అతని సన్నిహితుడు చెప్పినట్లు బాలీవుడ్‌లైఫ్ అనే వెబ్సైట్ వెల్లడించింది. షారుక్ బాధలో ఉన్నాడు. అతను సరిగా తినడం లేదు, నిద్రపోవడం లేదు. ఓ నిస్సహాయ తండ్రిగా ఉన్నాడు అని ఆ వ్యక్తి చెప్పినట్లు తెలిపింది. ఈ నెల 3న ఆర్యన్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన ఎన్సీబీ.. తర్వాత అరెస్ట్ చేసింది. అతనికి ముంబై కోర్టు బెయిల్ కూడా నిరాకరించడంతో ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్నాడు. 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీని అతనికి విధించారు.
ఆర్యన్ అరెస్ట్‌తో షారుక్ తన అన్ని మూవీల షూటింగ్‌లను నిరవధికంగా వాయిదా వేశాడు. ముంబైలోని అతని ఇల్లయిన మన్నత్‌కు ప్రతి రోజూ పలువురు బాలీవుడ్ స్టార్లు వచ్చి వెళ్తున్నారు. ఈ కష్ట సమయంలో వాళ్లు షారుక్‌ను ఓదారుస్తున్నారు.