కొత్త కాన్సెప్ట్‌తో ‘షరతులు వర్తిస్తాయి’
చైతన్యరావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి (అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్‌లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ‘షరతులు వర్తిస్తాయి’ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
చైతన్యరావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి (అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్‌లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ‘షరతులు వర్తిస్తాయి’ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అగ్ర నిర్మాత దిల్ రాజు హాజరు కాగా, దర్శకుడు వేణు ఊడుగుల, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ‘మామిడి హరికృష్ణ గారితో నాకు బలగం సినిమా టైంలో పరిచయమైంది. ఆయన ఆహ్వానం మేరకు రవీంధ్రభారతికి వెళ్లి సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునే వారికి కల్చరల్ డిపార్ట్మెంట్ ఇస్తున్న శిక్షణ చూసి ఆనందపడ్డా. ‘షరతులు వర్తిస్తాయి’ సినిమాను మంచి కాన్సెఫ్ట్‌తో తీశారు. బలగం కంటే ఎక్కువగా తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కించారు’ అన్నారు. మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. ‘సహజమైన కథా కథనాలతో కొత్త సినిమాటిక్ లిబర్టీ తీసుకొని రూపొందిన చిత్రమిది. సినిమా చేయాలనే కలతో గోదావరిఖని ప్రాంతం నుంచి వచ్చిన కుమారస్వామి కల నెరవేరబోతున్నది’ అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ వనమాలి, శేఖర్ పోచంపల్లి, సంగీతం: అరుణ్ చిలువేరు, నరేశ్ బొబ్బిలి, నిర్మాతలు: శ్రీలత, నాగార్జున సామల, శారద, శ్రీష్కుమార్ గుండా, విజయ, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు, రచన-దర్శకత్వం: కుమారస్వామి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | మమితా బైజు అసలు పేరు నమితనా? బర్త్ సర్టిఫికెట్లో జరిగిన పొరపాటుతో పేరు ఎలా మారిందో తెలుసా?
Plane Crash | ట్రంప్ నివాసానికి సమీపంలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. తొమ్మిది మంది మృతి
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
గ్లామర్ డోస్ పెంచేసిన హెబ్బా పటేల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ ఫొటోషూట్!
Ramayana | రామాయణకు భారీ స్పందన.. ఒక్కరోజులోనే 36 వేలకి పెరిగిన అడ్వాన్స్ బుకింగ్స్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

