Sharathulu Varthisthai! | ఓటీటీలోకి రాబోతున్న ‘షరతులు వర్తిస్తాయి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Sharathulu Varthisthai! | కీడా కోలా ఫేమ్ టాలీవుడ్ యువ నటుడు చైతన్య రావు, భూమి శెట్టి ప్రధానపాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. ఈ సినిమాకు కుమార స్వామి (అక్షర) దర్శకత్వం వహించగా.. స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై శ్రీలత, నాగార్జున సామల, శ్రద్ద, శ్రీకుమార్ గుండా తదితరులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
Sharathulu Varthisthai! | కీడా కోలా ఫేమ్ టాలీవుడ్ యువ నటుడు చైతన్య రావు, భూమి శెట్టి ప్రధానపాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. ఈ సినిమాకు కుమార స్వామి (అక్షర) దర్శకత్వం వహించగా.. స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై శ్రీలత, నాగార్జున సామల, శ్రద్ద, శ్రీకుమార్ గుండా తదితరులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబ జీవితాల ఆధారంగా వచ్చిన ఈ చిత్రం మార్చి 15న విడుదలై మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ సినిమా విడుదలై రెండు నెలలైన ఇంకా ఓటీటీ అప్డేట్ రాలేదు. ఇదిలావుంటే తాజాగా మేకర్స్ మూవీ ఓటీటీ డేట్‌ను లాక్ చేశారు.
ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ఈ సినిమా మే 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కరీంనగర్ జిల్లాలో ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన చిరంజీవి (చైతన్య రావు) తల్లి, తమ్ముడు, చెల్లి బాధ్యతలను భుజానికి ఎత్తుకొని బ్రతుకుతుంటాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన విజయశాంతితో చిరంజీవికి పెళ్లి అవుతుంది. ఈ క్రమంలోనే అనుకోకుండా చిరంజీవి ఒక బిజినెస్‌లో మోసపోతాడు. అయితే చిరంజీవి మోసపోయిన బిజినెస్ ఏంటి. ఈ ప్రమాదం నుంచి చిరంజీవి ఫ్యామిలీ ఎలా బయటపడింది అనే కథాంశంతో ఈ సినిమా వచ్చింది.
Manchi Middle class movie chudalani undha?🙋♂️
Aithe “షరతులు వర్తిస్తాయి!”💁♀️#SharathuluVarthisthaiOnAha Premieres May 18th!@IamChaitanyarao @ShettyBhoomi @NagarjunSamala @sureshbobbili9 @aksharakumar726 pic.twitter.com/2snj01oYkU— ahavideoin (@ahavideoIN) May 14, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
Rising Stars Asia Cup: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీ.. జట్టులో అభిషేక్, వైభవ్
RJD Somireddy | విద్యా ప్రమాణాల పెంపునకు సమష్టి కృషి చేయాలి : ఆర్జేడీ సోమిరెడ్డి
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

